»   » కాటమ రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ : పవన్ రెండు దశాబ్దాల జర్నీ పై ప్రోగ్రామ్

కాటమ రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ : పవన్ రెండు దశాబ్దాల జర్నీ పై ప్రోగ్రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలైంది. విశేషమైన స్థాయిలో అభిమానుల మనసు దోచుకుంటూ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసిన సందర్భాన్ని హైలైట్ చేస్తూ ఈ వేడుక జరుపుదామని ఈ సినిమా టీమ్ చెప్పిందట. కానీ పవన్ మాత్రం గ్రాండ్ గావద్దనీ చాలా సింపుల్ గా జరిగిపోవాలని చెప్పటంతో అంతా కాస్త డిసప్పాయింట్ అయినట్టు సమాచారం.

ఈనెల 24న రిలీజ్ అవనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇదిలావుంటే, రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో రేపు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్‌లో ఓ ప్రి-రిలీజ్ ఈవెంట్ జరపడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రెండు దశాబ్దాల తన నట ప్రయాణానికి సంబంధించిన విశేషాలతో ఓ ఏవీని చేయమనీ .. లేదంటే చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. కనుక .. పవన్ 20 సంవత్సరాల కెరియర్ కి సంబంధించిన విశేషాలను ఆవిష్కరిస్తూ .. 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుందన్న మాట.

'Katamarayudu' prerelease event to mark the Pawan's 20 years in Telugu film industry

వివిధ న్యూస్ ఛానెల్స్‌తోపాటు పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ఈ ఈవెంట్‌ని ప్రత్యక్షప్రసారం చేయనున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ పంక్షన్‌ని ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఈమేరకు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్ లింక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నాయికగా నటిస్తుండగా, ఇతర ప్రాతల్లో శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌, ఆలీ, నాజర్‌, రావు రమేష్‌, వేణుమాధవ్‌, తరుణ్‌ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ళ, సంగీతం: అనూప్‌ రుబెన్స్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు.

English summary
Just a few weeks to go for the grand release of Power star Pawan Kalyan starrer 'Katamarayudu' and the makers of it are already gearing up for a pre-release bash Tomarrow
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu