»   »  దుమ్ము దులిపింది: పవన్ ‘కాటమరాయుడు’ హాఫ్ లుక్

దుమ్ము దులిపింది: పవన్ ‘కాటమరాయుడు’ హాఫ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా పవన్‌ పంచెకట్టుతో మాస్‌ని ఆకర్షించేలా ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ "చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ "కాటమరాయుడు"లో మరోసారి కనువిందు చేయబోతోందని తెలిపారు.

"పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు" అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. దర్శకుడు కిశోర్ పార్దసాని పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.

Katamarayudu teaser to be out on 1st Jan

మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో 'ఉగాది' కి విడుదల అవుతుంది అన్నారు. తమిళంలో విజయం సాధించిన 'వీరమ్‌' చిత్రానికి రీమేక్‌గా 'కాటమరాయుడు'ని తెరకెక్కిస్తున్నారు.

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Announcing the date and time for the movie's teaser launch, the makers also released brand-new poster. Starring Pawan Kalyan as a faction leader, the movie has Shruti Haasan as heroine. Pawan Kalyan will also have four brothers in the movie. Being directed by Dolly, the movie has music by Anup Rubens. Sharat Marrar is producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu