twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనను మించిపోయిన తమ్ముడికి చిరంజీవి ఫోన్... ఏం జరిగిందంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమా భారీ విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సంవత్సరం రెండు సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినమా అయితే, మరొకటి గీతా ఆర్ట్స్ బేనర్లో బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నారు.

    పాలిటిక్స్ లో ఉన్న సమయంలో, మంత్రిగా పని చేసిన సమయంలో బిజీగా ఉండటం సినిమాలపై అంతగా దృష్టి పెట్టేవారు కాదు మెగాస్టార్. అయితే ప్రస్తుతం ఆయన తన ఫోకస్ అంతా సినిమా రంగంపైనే పెట్టారు.

    ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమా షూటింగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏదైనా ట్రైలర్ రిలీజైనా, సినిమా రిలీజైనా చూసి తన అభిప్రాయం వెల్లడించడం, వారిని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారట.

    ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' టీజర్ రిలీజ్ అయి రికార్ట్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడంతో చిరంజీవి స్వయంగా తమ్ముడికి ఫోన్ చేసి అభినందించారట.

     తమ్ముడు మించి పోయాడు

    తమ్ముడు మించి పోయాడు

    ఇటీవల విడుదలైన ‘ఖైదీ నెం 150' ట్రైలర్, టీజర్, సాంగులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే వాటిన్నింటి యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ ‘కాటమరాయుడు' దూసుకెలుతున్న నేపథ్యం చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి అభినందించడం విశేషం.

     టీజర్ రికార్డ్

    టీజర్ రికార్డ్

    ‘కాటమరాయుడు టీజర్‌ అత్యంత వేగంగా 1 మిలియన్ హిట్స్‌ని సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం టీజర్ రిలీజైన రెండు గంటల్లోనే ఈ ఫీట్ సాధించిందట. ఇక ఒక రోజులో 37 లక్షల మంది ఈ టీజర్‌ను చూసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

     ఇదు తొలిసారి

    ఇదు తొలిసారి

    ఇప్పటిదాకా ఏ తెలుగు టీజర్ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు. కేవలం టీజరే ఈ రేంజిలో సత్తా చాటుతోందంటే... సినిమాలపై అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

     రిలీజ్ డేట్

    రిలీజ్ డేట్

    సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు.

    English summary
    Film Naga source said that, Chiranjeevi has telephoned Pawan Kalyan after watching the teaser of Katamarayudu. While the teaser of Khaidi No.150 had recorded 1 Million views in 3 hours after it was released, the teaser of Katamarayudu achieved the same feat in just 2 hours after it's release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X