»   » కాటమరాయుడు టైటిల్ సాంగ్ రేపే విడుదల... ఎన్నిగంటలకో తెలుసా

కాటమరాయుడు టైటిల్ సాంగ్ రేపే విడుదల... ఎన్నిగంటలకో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు సినిమాపై అభిమానులలో ఏ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ఇటీవల విడుదలైన టీజర్ ని బట్టే తెలుస్తుంది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలలోనే రికార్డు వ్యూస్ సాధించింది. పవర్ స్టార్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్రం తమిళ సూపర్ హిట్ చిత్రం వీరమ్ కి రీమేక్ గా తెరకెక్కుతుండగా ఇందులో పవన్ ఢిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఈ మధ్య ట్రెండ్ కి తగ్గట్టు గానే ఈ సినిమాకి కూడా ఏ ఆడియో ఫంక్షనూ లేకుండా డైరెక్ట్ గా ఒక్కో సాంగ్ నీ రిలీజ్ చేయనున్నారు. అదే సిరీస్ లో భాగంగా ఈరోజే సాయంత్రం నాలుగు గంటలకి "రాయుడు" టైటిల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. నిజానికి ఈ సాంగ్ ఇప్పుడు చాలామందికే తెలిసిపోయింది.


Katamarayudu title song release

ఎందుకంటే సాంగ్ ఆన్‌లైన్‌లో లీకైంది. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తుండగా అంతే రేంజ్ లో ఈ టైటిల్ సాంగ్ కూడా ఊపందుకుంది. లీకైన ట్రాక్ ఒక నిమిషం ఐదు సెకన్ల పాటు ఉంది. అడిగో అడిగో చూడు.. ఓ సైనికుడొస్తున్నాడు.. అరె నలుదిక్కుల వెలుగొచ్చే ఓ సూరీడొస్తున్నాడు అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో తెగ హల్‌చల్ చేసింది.


ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి రూపొందించిన భారీ సెట్లో సుమారు 400 మంది డ్యాన్సర్లతో ఈ పాటను రూపొందించారట. అనూప్ రూబెన్స్ ఈ పాటకు అందించిన సంగీతం, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అన్నీ చాలా బాగా కుదిరినట్టు తెలుస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లుగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ, అజయ్ లు నటిస్తున్నారు. ఈ మార్చి నెల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి 24వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు.

English summary
Pawan kalyan's Latest Movie Katamarayudu Title Songe will be realease Tomarrow 4 pm
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu