»   » కాటమరాయుడు వెబ్‌సైట్ క్రాష్.. పోటెత్తిన ఫ్యాన్స్.. నేడే ప్రీ రిలీజ్ ఫంక్షన్

కాటమరాయుడు వెబ్‌సైట్ క్రాష్.. పోటెత్తిన ఫ్యాన్స్.. నేడే ప్రీ రిలీజ్ ఫంక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండగా అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. అభిమానుల క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనుకొన్న నిర్మాత శరత్ మరార్ కాటమరాయుడు స్టోర్ (katamarayudustore.com) అనే పేరుతో ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించారు. కాటమరాయుడు చిత్రంలో పవన్ కల్యాణ్ ధరించిన క్యాస్టూమ్స్ డిజైన్లతో కూడిన దుస్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి.

ఆన్‌లైన్ స్టోర్‌లో కాటమరాయుడు

ఆన్‌లైన్ స్టోర్‌లో కాటమరాయుడు

పవన్ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్‌లో katamarayudustore.com వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని చిత్ర నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయం ప్రకటించగానే అభిమానులందరు పవన్ ధరించిన బట్టలను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.


అనూహ్య స్పందన.. క్రాష్

అనూహ్య స్పందన.. క్రాష్

చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యే రేంజ్‌లో అభిమానుల స్పందన కనిపించింది. అయితే హెవీ ట్రాఫిక్ వల్ల katamarayudustore.com అనే వెబ్ సైట్ కొద్ది గంటలలో క్రాష్ అయింది. ప్రస్తుతం ఈ వైబ్‌సైట్‌ను చేరుకోలేరనే సందేశం కనిపిస్తున్నది.


నార్త్‌స్టార్‌తో ఎకోరా ఒప్పందం

నార్త్‌స్టార్‌తో ఎకోరా ఒప్పందం

ఆన్‌లైన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రాండ్ దుస్తుల అమ్మకాలు చేపట్టడానికి నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎకోరా అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకోన్నది. ఈ దుస్తులు ఎకోరా డీలర్ల వద్ద, ‘కాటమరాయడు' చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల వద్ద అందుబాటులోకి రానున్నాయి.


నేడే ప్రీ రిలీజ్ ఫంక్షన్

నేడే ప్రీ రిలీజ్ ఫంక్షన్

కాటమరాయుడు వెబ్‌సైట్ క్రాష్ కావడంతో పవర్‌స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. శనివారం ( మార్చి 18) సాయంత్రం కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 24న విడుదల చేయనున్నారు.


English summary
Due to huge response from Power Star Pawan Kalyan fans Katamarayudu Website crashed. Recently a online store started by Echora Store. T-shirt imprinted with Pawan’s still from the set along with Katamarayudu towels have been put on the website (www.katamarayudustore.com) for the sale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu