»   » నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ టీజర్

నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ త్వరలో 'కథలో రాజకుమారి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నారా రొహిత్ తో పాటు నాగ శౌర్య, నమితా ప్రమోద్, నందితా రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా 'కథలో రాజకుమారి' టీజర్ రిలీజైంది. నారా రోహిత్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాన్ని నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు విశాల చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన నారా రోహిత్ చిత్రాల్లానే ఈచిత్రం కూడా ఫీల్ గుడ్ గా ఉంటుందని అంటున్నారు.


English summary
Kathalo Rajakumari Movie First Look Motion Teaser released. Kathalo Rajakumari is an upcoming Telugu film directed by debutante Mahesh Surapaneni and produced by Venkat Srinivas Boggaram under Magnus Cine Prime. Starring Nara Rohit and Namitha Pramod playing the lead roles in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu