»   » అణువణువూ నెగెటివ్....నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ ట్రైలర్

అణువణువూ నెగెటివ్....నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్, నమిత ప్రమోద్ హీరో హీరోయిన్లుగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథలో రాజకుమారి'. నాగ శౌర్య ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.

ఇంతకు ముందెన్నడూ తెలుగు తెరపై చూడని విభిన్నమైన క్యారక్టరైజేషన్ లో నారా రోహిత్ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ది బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టూ నారా రోహిత్.... అతడి బ్లడ్ గ్రైఫ్ మాత్రమే కాదు బాడీలోని ప్రతి సెల్ నెగెటివే అంటూ సాగే డైలాగులతో సినిమాలో నానా రోహిత్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది.మేస్ట్రొ ఇళయరాజా గారు ఈ చిత్రానికి రెండు గీతాలను అందిస్తుండగా... "క్రిష్ణగాడి వీరప్రేమగాధ" సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలను అందించారు. నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్, ప్రబాస్ శ్రీను, రఘుబాబు, తనికెళ్ళ భరణి, శ్రీముఖి, చలపతిరావు, జెన్నీ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


ఈ చిత్రాన్ని జూన్ 30 వ తారీకున రిలీజ్ చేయుటకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్ టైన్ మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సం యుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సౌందర్య నర్రా, ప్రశాంతి, సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ వర్మ సిరివూరి సమర్పకులు. ఈ విభిన్నమైన ప్రేమ కధా చిత్రానికి నరేష్ కె రాణా చాయాగ్రహణం వహిస్తుండగా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు.


English summary
Watch Kathalo Rajakumari Official Theatrical Trailer . #KathaloRajakumari movie stars Nara Rohit, Namitha Pramod in lead roles. Directed by Mahesh Surapaneni. Produced by Krishna Vijay, Prashanthi and Soundarya Narra. Music by Vishal Chandrashekhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu