»   »  విలక్షణంగా 'కథానాయకుడు' ఆడియో

విలక్షణంగా 'కథానాయకుడు' ఆడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kathanayakudu
రజనీకాంత్ 'కథానాయకుడు'గా నిజ జీవిత పాత్రను పోషిస్తున్న 'కథానాయకుడు' ఆడియో నేడు మార్కెట్లో విడుదలయ్యింది. సోమవారం చెన్నైలోని లీ మెరీడియన్ హోటల్‌లో విలక్షణంగా జరిగిన కార్యక్రమంలో తెలుగు, తమిళ (కుసేలన్) సినిమాల ఆడియోలు రెండింటినీ ఆవిష్కరించారు. 400 సీట్లు వున్న అక్కడి ఆడిటోరియం దాదాపు 1500 మంది అభిమానులతో కిక్కిరిసిపోయింది.జగపతిబాబు బాల్య మిత్రుడుగా రజనీ ఈ సినిమాలో కనిపిస్తారు.దాంతో స్నేహం విలువను చాటిచెప్పే సినిమా థీమ్ కు తగ్గట్లుగానే ఈ ఆడియో వేడుక కూడా స్నేహితుల కలయికకు వేదికగా మారడం విశేషం. ఈ సినిమాకు పని చేసినవాళ్లు తన నిజ జీవిత మిత్రుల్ని వేదికపైకి ఆహ్వానించి వారికి ఆడియో సీడీలను అందించారు.

మొదట లాంఛనంగా కవితాలయ సంస్థ అధినేత కె బాలచందర్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని ముఖ్య అతిథిగా వచ్చిన ఎఆర్ రెహమాన్‌కు అందజేశారు. ఆ తర్వాత 'కథానాయకుడు' రజనీకాంత్ తన మిత్రుడు మురళిని వేదిక మీదకు ఆహ్వానించి సీడీని అందజేశారు. దర్శకుడు పి వాసు తన మిత్రుడు లియో క్రిస్టఫర్‌కు, 'కుసేలన్' నిర్మాత బాలచందర్ తన స్నేహితుడు భారతీరాజాకు, 'కథానాయకుడు'లో హీరోగా నటించిన జగపతిబాబు తన స్నేహితుడు అయిన హీరో అర్జున్‌కు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తన మిత్రుడు విజయ్‌కు ఆడియో సీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో లతా రజనీకాంత్, విబి రాజేంద్రప్రసాద్, ధనుష్, ఐశ్వర్య, సునీల్, అలీ, వడివేలు తదితరులు పాల్గొన్నారు. బాలచందర్ తన స్నేహితుడిగా పేర్కొంటూ సీడీని అందుకోవడానికి రావలసిందిగా పిలిచినప్పుడు భారతీరాజా భావోద్వేగంతో కన్నీళ్లను ఆపుకోలేక పోవడం గమనార్హం. 'పద్మశ్రీ బిరుదు కంటే బాలచందర్ నన్ను స్నేహితుడిగా అందరి ముందూ పేర్కొంటూ ఇచ్చిన ఆడియో సీడీనే నాకెక్కువ' అని ఆయన వ్యాఖ్యానించాడు.ఇలా విలక్షణంగా జరిగిన ఈ ఆడియో ఓ మంచి సుహుర్బావ వాతావరణాన్ని అక్కడున్న వారిలో కలగచేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X