»   » ‘కత్తి’ వివాదం: ఇరుక్కున్న రాంచరణ్‌ ఫ్యాన్స్...

‘కత్తి’ వివాదం: ఇరుక్కున్న రాంచరణ్‌ ఫ్యాన్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన తమిళ చిత్రం ‘కత్తి'. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో సరికొత్త వివాదాలకూ, చర్చకూ దారిస్తోంది. ‘కత్తి' కథ నాదే అంటూ నరసింహారావు అనే ఓ రచయిత గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ వివాదమై పూర్వాపరాలను పరిశీలించిన కథా హక్కుల సమాఖ్య రచయితకు మద్దతుగా నిలిచింది. ఆ సమస్య పరిష్కారం కాకుండానే ‘కత్తి'ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకోవడంతో రచ్చ మళ్లీ మొదలైంది.

అయితే ఈ వివాదంలోకి దాసరి,చిరంజీవి, రామ్ చరణ్ వచ్చి పడ్డారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా పేజీలో దాసరికి అశ్రు నివాళి అని రాసి వివాదం రాజేసారు. దాంతో ఇప్పుడు అది క్రై డిపార్టమెంట్ పరిధిలోకి వెళ్లింది.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్‌ మాట్లాడుతూ...‘‘చిరంజీవిగారి 150వ సినిమాకు దాసరిగారు అడ్డుపడుతున్నారంటూ అసత్య కథనాలు సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో ప్రచురించడం, ‘రాంచరణ్‌ ఫ్యాన్స్' పేర ఉన్న ఓ సోషల్‌ మీడియా పేజీలో దాసరికి అశ్రునివాళి అంటూ రాయడం బాధాకరం. ఇది ఎవరు చేశారన్నది సైబర్‌ క్రైం డిపార్ట్‌మెంట్‌ త్వరలోనే తెలియజేస్తుంది. వారికి శిక్ష తప్పదు. దాసరిగారికి, చిరంజీవిగారికి ఎటువంటి సంబంధం లేని సమస్య ఇది. వారిద్దరి మధ్య గొడవలు రేపేందుకు కుట్రలు చేస్తున్నారు'' అని చెప్పారు.

‘Kathi’ controversy hits Ram Charan fan page

అలాగే...కొత్త కుర్రాడు కష్టపడి రాసుకున్న కథకు అన్యాయం జరిగితే అతని భవిష్యత్తు ఏంటన్న విషయంపై 16 మందితో కూడిన ఓ కమిటీతో దాసరి నారాయణరావుగారు ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతికారు. రచయితకు పరిహారంగా కొంత మొత్తంలో ఇవ్వాలని సూచించాం. ఇందుకు ఎన్వీ ప్రసాద్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇంతలోనే ఈ అసత్య కధనాలు వచ్చాయని అని ఆయన అన్నారు.

వీరశంకర్ కంటిన్యూ చేస్తూ...‘‘కత్తి' వివాదం పదహారు నెలల నుంచీ నలుగుతూనే ఉంది. ఓ దశలో తమిళ చిత్రసీమ నుంచి దర్శకుల బృందం వచ్చి కథా హక్కుల సమితి అధ్యక్షులు దాసరి నారాయణరావుగారితో సంప్రదింపులు జరిపారు. ‘నరసింహారావుకి న్యాయం చేస్తాం' అని మాటిచ్చారు. అయితే... ఆ మాట మరిచి మళ్లీ లీగల్‌ ఒపీనియన్‌ పంపించారు. నరసింహారావుకి న్యాయం జరిగేంత వరకూ ఈ పోరాటం ఆగదు''అన్నారు.

కథా హక్కుల సమితి ఉపాధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘‘కత్తి' రీమేక్‌ విషయంలో చిరంజీవి స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ‘కత్తి' కథపై ఉన్న వివాదం తీరాకే ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తామని చిరంజీవి చెప్పారు. మధ్యవర్తుల ద్వారా ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి''అన్నారు.

English summary
When Ramcharan announced that the 150th film of his father that he would produce was a Telugu remake of ‘Kathi’, Mr. Narasimha Rao took the matter to the notice of the United Forum of Telugu Film Directors, of which former Union Minister and popular director Dasari Narayana Rao is Chairman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu