»   » సినిమా ఆడదని చెప్పా, కానీ ప్రేక్షకులు నన్ను ఎదవను చేశారు: మహేష్ కత్తి

సినిమా ఆడదని చెప్పా, కానీ ప్రేక్షకులు నన్ను ఎదవను చేశారు: మహేష్ కత్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kathi Mahesh Talks About 'Nedi Nadi Oke Katha'

శ్రీవిష్ణు కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నీదీ నాదీ ఒకే కథ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల నుండి కూడా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివాదాస్పద క్రిటిక్ మహేష్ కత్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

స్టాండింగ్ ఓవేషన్ చూసి ఆశ్చర్యం

స్టాండింగ్ ఓవేషన్ చూసి ఆశ్చర్యం

‘23వ తేదీన రాత్రి 9.30 గంటలకు నాకు ఒంగోలు నుండి ఫోన్ వచ్చింది. అక్కడి గోరంట్ల థియేటర్లో సినిమా అయిపోగానే స్టాండింగ్ ఓవేషన్. ఈ విషయం నాకు ఓ మిత్రుడు ఎంతో ఎగ్జైటింగ్‌గా చెప్పాడు. హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాంటి స్టాండింగ్ ఓవేషన్ చూశాను. తెలుగు సినిమాలకు స్టాండింగ్ ఓవేషన్ హైదరాబాద్ లో కూడా చూడలేదు. అలాంటిది ఒంగోలులో చూశాను అని ఆశ్చర్యపోయాడు.... అని మహేష్ కత్తి తెలిపారు.

ప్రేక్షకుడు ఆల్రెడీ థాంక్స్ చెప్పారు

ప్రేక్షకుడు ఆల్రెడీ థాంక్స్ చెప్పారు

నేను అతడితో ఒకటే చెప్పాను. నాకైతే సినిమా నచ్చింది, దానిపై నా అభిప్రాయం ఏదో చెప్పేసి తర్వాత దాని గురించి పట్టించుకోను. ఎందుకంటే నాకు నచ్చే సినిమాలు చాలా వరకు ప్రేక్షకులకు నచ్చవేమో అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు ఆల్రెడీ దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు మంచి సినిమా అందించినందుకు.... అని మహేష్ కత్తి అన్నారు.

చరిత్రలో నిలిచిపోయే సినిమా

చరిత్రలో నిలిచిపోయే సినిమా

ఈ మధ్య కాలంలో 8 నిమిషాల రివ్యూ ఏ సినిమాకు చెప్పలేదు. ఈ సినిమాకు చెప్పాల్సి వచ్చింది. అన్ని మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. తిట్టడానికి రెండు మాటలో మూడు మాటలో వాడతాం. ఒక మంచి సినిమా గురించి మనస్ఫూర్తిగా చెప్పాలంటే చాలా మాటలు వాడాల్సి ఉంటుంది. ఈ సినిమాను ప్యాక్ చేసినటువంటి విధానం బావుంది. ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించి కనీసం 10 ఇష్యూలను చాలా లోతుగా, ఘాడంగా విశ్లేషించి, విమర్శించి దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్ చూపించిన సినిమా ఇది. అందుకనే చరిత్రలో మిగిలిపోతుంది.... అని మహేష్ కత్తి తెలిపారు.

కవి సినిమా తీయడం ప్రమాదం అనుకున్నా

కవి సినిమా తీయడం ప్రమాదం అనుకున్నా

ఇపుడున్న సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ప్రగతిని చూసే విధానం, డబ్బుల్ని కొలిచే విధానం, సక్సెస్‌ను నిర్వచించే విధానం... వీటిలో ఏది తీసుకున్నా ఈ సినిమా ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాంపుల్‌గా కోట్ చేయబడుతుంది. వేణు ఊడుగుల ఒక కవి, కవి సినిమా తీయడం అంటే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అనుకునే వాడిని, ఎందుకంటే ఏదేదో లేయర్లు ఆలోచిస్తాడు, ఒక లైన్ రాసి దాంట్లో పది అర్థాలు ఉన్నాయి వెతుక్కోండి అని చెబుతాడు. ఇలాంటి మనిషి సినిమా తీస్తే మోస్ట్ కాంప్లెక్స్ సినిమా అవుతుంది, ఎవరైనా సినిమా చూస్తారా? నేను చూసినా నాకు అర్థమవుతుందా? అనే డౌట్ ఉండేది.... అని మహేష్ కత్తి చెప్పుకొచ్చారు.

ప్రేక్షకలు నేను ఎదవను అని నిరూపించారు

ప్రేక్షకలు నేను ఎదవను అని నిరూపించారు

ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే అన్నాను. ఈ సినిమా తెలుగులో కన్నా వేరే భాషల్లో బాగా ఆడుతుంది అన్నాను. ఎందుకంటే తెలుగులో ప్రేక్షకులు దీన్ని నిజంగా ఆదరిస్తారా? అనేది నాకున్న డౌట్. నా డౌట్‌ను పటాపంచలు చేసి నేను ఎదవను అని నిరూపించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.... అని మహేష్ కత్తి తెలిపారు.

English summary
Kathi Mahesh Comments On Needi Naadi Okate Kadha Thanks Meet. Needi Naadi Oke Katha starring Sri Vishnu, Satna titus directed by Venu Udugula.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X