Kathi Mahesh అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే! భార్య, కొడుకు ఎక్కడున్నారంటే..

సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ మరణం ఆకస్మిక మరణం ఎందరినో తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తమ సన్నిహితుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి విషాదం నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? ఆయన భార్య, పిల్లల గురించి కొన్ని వివరాలు సంక్షిప్తంగా...

ఆదర్శ భావాలతో..

ఆదర్శ భావాలతో..

కత్తి మహేష్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎప్పుడూ ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి నుంచి ఆదర్శ భావాలు పాటిస్తూ ఉండటం, సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించి వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.

యూనివర్సిటీలో ప్రేమలో పడి..

యూనివర్సిటీలో ప్రేమలో పడి..

ఇక సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే సమయంలోనే బెంగాలీ అమ్మాయి సోనాలితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరు మతాంతర వివాహం చేసుకొన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కొద్దికాలం క్రితం తన కుమారుడి బర్త్ డే రోజున నా కొడుకు అంటూ సోషల్ మీడియాలో ఆయన పరిచయం చేశారు.

భోపాల్‌లో భార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో

భోపాల్‌లో భార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో


కత్తి మహేష్, భార్య సొనాలి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో వారు స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆమె ఇప్పుడు భోపాల్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికీ భార్య సొనాలితో కత్తి మహేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమయం చిక్కినప్పుడల్లా భార్య, పిల్లలతో కత్తి మహేష్ గడుపుతుంటారు.

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు

గతంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 1లో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత పూణే నుంచి నేరుగా భోపాల్‌లోని భార్య పిల్లాడి వద్దకు కత్తి మహేష్ వెళ్లి కొంత సమయం గడిపారు. ఆ తర్వాతనే ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. భార్యతో విడిపోయినా గానీ.. స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ.. కొడుకు అంటే ఎంతో ప్రేమను వ్యక్తం చేయడం తెలిసిందే.

Recommended Video

Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
చిత్తూరు జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు

చిత్తూరు జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు

ఆకస్మికంగా మరణించిన కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సమీపంలోని తన స్వగ్రామంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై నుంచి కత్తి మహేష్ భౌతికకాయాన్ని నేరుగా తన స్వగ్రామానికి తరలించి.. ఆదివారం జూలై 10వ తేదీన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X