twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భాగమతి’ చిత్రంపై మహేష్ కత్తి రివ్యూ....

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘భాగమతి’ చిత్రంపై మహేష్ కత్తి రివ్యూ....!

    ఒకప్పుడు కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి.... పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం తర్వాత బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పే సినిమా రివ్యూలపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. మరి తాజాగా విడుదలైన అనుష్క 'భాగమతి' చిత్రంపై మహేష్ కత్తి రివ్యూ ఎలా ఉందో ఓ సారి లుక్కేద్దాం.

     కన్విన్సింగ్‌గా ముగిసింది

    కన్విన్సింగ్‌గా ముగిసింది

    ‘భాగమతి' టైటిల్ అనౌన్స్ చేసినపుడు అంతా ఇది హైదరాబాద్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇదో హారర్ ఫిల్మ్ అని అందరికీ అర్థమైంది. థియేటర్‌కు వెళితే ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా మొదలై ఆపై హారర్‌గా పరిణాంతరం చెంది అంతే ఎంగేజింగ్ ఎండింగ్‌తో కన్విన్సింగ్‌గా ముగిసింది అని మహేష్ కత్తి తెలిపారు.

    ఇదే ఆ సినిమా బలం

    ఇదే ఆ సినిమా బలం

    కథ, కథనాలు, రచన పరంగా దర్శకుడు అశోక్ చేసిన విన్యాసాలు అందరినీ కట్టిపడేసేలా చేశాయి. ఇది పూర్తిగా రైటర్స్ ఫిల్మ్. రచన పరంగా అంతే స్థాయిలో ఆకట్టుకోవడం, ప్రతీ సీన్లోనూ ఓ ట్విస్టు. దాన్ని అంతే స్థాయిలో రంజింప చేయగలుగడం ఈ సినిమా యొక్క బలం.... అని మహేష్ కత్తి తెలిపారు.

     అలా మిక్స్ చేయడం క ష్టం, కానీ...

    అలా మిక్స్ చేయడం క ష్టం, కానీ...

    ఒక కొత్తరకమైన కథ ఇది. పొలిటికల్ థ్రిల్లర్ మూవీని హారర్ థ్రిల్లింగ్ అంశాలతో మిక్స్ చేయడం కష్టం. కానీ దాన్ని ఎలా మిక్స్ చేశారు? ఏ విధమైన నేరేటివ్ స్ట్రక్చర్‌తో దీన్నికన్విన్స్ చేశారు అనేది తెరపై చూడాల్సిందే. ఇంతకు మించి ఎక్కువ విషయాలు చెబితే మీకు సినిమా మొత్తం రివీల్ చేసినట్లు ఉంటుంది. అందుకే కథ గురించి ఎక్కువగా చెప్పడం లేదు.... అని మహేష్ కత్తి అన్నారు.

    అనుష్క నటనతో తనదైన శైలిలో మెప్పించారు.

    అనుష్క నటనతో తనదైన శైలిలో మెప్పించారు.

    అనుష్క నటనతో తనదైన శైలిలో మెప్పించారు. సౌత్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్ అని మరోసారి నిరూపించుకుంది. ఈ సినిమాలో తన పాత్రలో మమేకమై నటించింది. జయరాం, ఆశా మలయాళం నటులు అయినప్పటికీ ఒక వినూత్నాన్ని ఈ సినిమాకు తీసుకొచ్చారు. రెగ్యులర్ గా ఎవరినైనా పెడితే ఆ ఫ్రెష్ నెస్ వచ్చుండేది కాదేమో. మురళీ శర్మ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. కమెడియన్ ధనరాజ్, ప్రభాస్ శ్రీను ప్రధమార్థంలో కొంత వరకు ఎంటర్టెన్మెంట్ అందించారు.... అని మహేష్ కత్తి తెలిపారు.

     టెక్నికల్ విభాగాలు హైలెట్

    టెక్నికల్ విభాగాలు హైలెట్

    ఈ చిత్రంలో రచన తర్వాత సినిమాటోగ్రఫీ మది గురించి, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా చాలా వరకు ప్రత్యేకంగా వేసిన పాతకాలం నాటి బంగ్లా సెట్లో జరుగుతుంది. దానికున్న బ్యాగ్రౌండ్ ఏమిటి? దానికున్న చరిత్ర ఏమిటి? దానికున్న మతలబు ఏమిటి అనే దాని మీద సినిమా అంతా ప్లే అవుతుంది. అలాంటి సెట్‌ని కన్విన్సింగ్‌గా చేయడం, దాంట్లో చాలా వరకు జాగ్రఫీని ఎక్స్‌ప్లోర్ చేస్తూ థ్రిల్లర్‌గా పండించడం, హారర్‌గా భయ పెట్టడంలో సక్సెస్ అయ్యారు. సెట్స్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ మది లైటింగ్ సెట్ చేసుకున్న తీరు, నైట్ సీక్వెన్స్ షాట్స్, హారర్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసిన విధానం బావుంది. ఈ ఇద్దరికీ తమన్ సంగీతం బాగా తోడైంది. ఈ చిత్రంలో ఒకే ఒక మెలొడీ ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా తమన్ మరోసారి ఒక మంచి సినిమాకు తను ఎలా వెన్ను దన్నుగా నిలబడగలడో? నిరూపించుకున్నాడు. రొటీన్ మ్యూజిక్‌కి భిన్నంగా మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.... అని మహేష్ కత్తి తెలిపారు.

     సక్సెస్ కొట్టాడు

    సక్సెస్ కొట్టాడు

    సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అశోక్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టాడని చెప్పొచ్చు. ఇంటిగ్రిటీ ఆఫ్ రైటింగ్, కన్విన్సింగ్‌గా చెప్పడం బావుంది. చాలా వరకు ఇలాంటి జోనర్ ఆఫ్ మిక్సింగులో చివరి వరకు వచ్చే సరికి తేలిపోతాం. బహుషా మనం చెబుతున్న దాంట్లో కన్విక్షన్ లేక పోవడం, ఏం చెబుతున్నామో ప్రేక్షకులకు సరిగా అర్థం కాకపోవడం, వేసిన ముడులు సరిగా విప్పలేక పోవడం లాంటివి ఉంటాయి. కానీ అలా కాకుండా ఈ సినిమా చివరి వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీన్ థ్రిల్లర్‌గానూ, హారర్‌గానూ చూపించి మనల్ని నమ్మించి అంతే స్థాయిలో సంతృప్తి పరుస్తుంది.... అని మహేష్ కత్తి తెలిపారు.

    English summary
    Kathi Mahesh Review on BHAAGAMATHIE Movie. Lady Oriented Movie BHAGAMATHIE is getting Positive Talk.Anushka Role Is The Main Asset For the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X