twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజను రివ్యూతో టచ్ చేసిన ‘కత్తి’... హైపర్ ఆది ఘాటు కౌంటర్!

    By Bojja Kumar
    |

    రవితేజ హీరోగా తెరకెక్కిన 'టచ్ చేసి చూడు' ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైంది. గతంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు నటించిన సినిమాలను రివ్యూ చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురైన మహేష్ కత్తి తాజాగా రవితేజ సినిమాను కూడా టచ్ చేశాడు.

     సినిమా బాగోలేదన్న కత్తి

    సినిమా బాగోలేదన్న కత్తి

    రవితేజ ఇటీవల ‘రాజా ది గ్రేట్' సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడం, ‘టచ్ చేసి చూడు' టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై హోప్స్ పెరిగాయి. ‘విక్రమార్కుడు' తరహాలో మంచి పోలీస్ గెటప్‌లో రవితేజ కనిపించడం కూడా ఆసక్తి పెంచింది. కానీ థియేటర్‌కు వెళ్లాక నిరాశే మిగిలింది.... అంటూ మహేష్ కత్తి తన రివ్యూ మొదలు పెట్టాడు.

    ప్రేక్షకుడికి కథ అర్థం కాలేదు

    ప్రేక్షకుడికి కథ అర్థం కాలేదు

    ప్రథమార్థంలో పాండిచ్చేరిలో జరిగే ఫ్యామిలీ కథ, ద్వితీయార్థంలో పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ రెండు కూడా కలగాపులగం అయిపోయి అసలు కథేమిటి? అనే సందేహంలో ప్రేక్షకుడు పడిపోయేలా చేసింది..... అని మహేష్ కత్తి అన్నారు.

     సంబంధం లేని కథలు సెట్టవ్వలేదు

    సంబంధం లేని కథలు సెట్టవ్వలేదు

    ఫస్టాఫ్, సెకండాఫ్ అసలు సంబంధం లేకుండా ఉండే రెండు కథలను తీసుకొచ్చి పడేసి వాటి ద్వారా కొన్ని యాక్షన్ సీక్వెన్స్, రెండు లవ్ స్టోరీలు కలిపి ఏదో మిక్సర్ చేశారు. ఇది అస్సలు సెట్ కాలేదు అని.... మహేష్ కత్తి తెలిపారు.

     వక్కతం వంశీ ఇలాంటి కథ ఇస్తాడనుకోలేదు

    వక్కతం వంశీ ఇలాంటి కథ ఇస్తాడనుకోలేదు

    వక్కతం వంశీ ఇంత అర్థరహితమైన కథను ఎందుకు అందించాడు అనే సందేహం అందిరిలోనూ కలుగుతుంది. ఇలాంటి కథను అతడి నుండి ఊహించలేదు అని.... మహేష్ కత్తి తెలిపారు.

     దర్శకుడు ఫెయిల్ అయ్యాడు

    దర్శకుడు ఫెయిల్ అయ్యాడు

    నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ సినిమాను కమర్షియల్ ఫార్ములాగా తీసుకెళ్లడంలోనూ, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే విధంగా సినిమాను నడిపించడంలోనూ ఫెయిల్ అయ్యాడు. పేలవమైన సీన్లతో సినిమా అంతా రన్ అవుతుంది.... అని మహేష్ కత్తి విమర్శించారు.

     ఆ రెండూ బావున్నాయి కానీ

    ఆ రెండూ బావున్నాయి కానీ

    సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బావుండటంతో ఫ్రేమ్ అందంగా కనిపించడం తప్ప సీన్లలో బలం లేదు. దీంతో నటీనటులు కాస్తో కూస్తో పెర్ఫార్మ్ చేసినా వాటికి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోడంతో సినిమా అత్యంత పేలవమైన ప్రయత్నంగానే మిగిలింది.... అని మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.

     లవ్ స్టోరీ కూడా వేస్ట్

    లవ్ స్టోరీ కూడా వేస్ట్

    రాశీ ఖన్నా, సీరత్ కపూర్ అందాల ఆరబోతకు, కేవలం అప్పుడప్పుడు వచ్చి హీరోను పెప్ చేయడానికి మాట్లాడే మాటలే తప్ప నిజంగా ఒక బలమైన కథకానీ, ఆ ప్రేమ కథకు సంబంధించిన కొనసాగింపు కానీ ఈ సినిమాలో కనిపించదు.... అని మహేష్ కత్తి తెలిపారు.

     సాంకేతికంగా కూడా గొప్పగా లేదు

    సాంకేతికంగా కూడా గొప్పగా లేదు

    ఫ్యామిలీ బాండింగ్ గురించి ఫస్టాఫ్ అంతా హీరో చెబుతాడు కానీ అది మనకు కనెక్ట్ అయ్యే విధంగా లేదు. ప్రీతమ్ అందించిన సంగీతం సోసో అనిపిస్తుంది, మణిశర్మ సంగీతం ఓకే అనిపిస్తుంది. సాంకేతికంగా కూడా చెప్పుకోదగ్గ సినిమా కాదు... అని అన్నారు.

    టచ్ చేయకుంటేనే బెటర్

    నటీనటులు తమవంతు ప్రయత్నం చేసినప్పటికీ కథ కథనాల బలహీనత కారణంగా ఎటూ పొసగని, పండని సినిమాగా మిగులుతుంది. ఇలాంటి సినిమాను మనం టచ్ చేయకుండా ఉండాల్సింది అనే సందేహంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. విక్రమ్ సిరికొండ ప్రయత్నం బెడిసికొట్టింది. ట్రై యువర్ లక్ అని ఈ సినిమాకు నేను చెప్పలేను. టచ్ చేయకుండా ఉంటేనే బెటరని మాత్రమే చెప్పగలను.... అంటూ సినిమాను ఏకిపారేశారు కత్తి.

    హైపర్ ఆది కౌంటర్

    గతంలో పవన్ కళ్యాణ్ మీద మహేష్ కత్తి కామెంట్స్ చేసినపుడు గట్టిగా కౌంటర్ ఇచ్చిన జబర్దస్థ్ కమెడియన్ హైపర్ ఆది..... తాజాగా కూడా ఓ కౌంటర్ విసిరాడు. ముందు మంచి సినిమాలు తీయండి, ఆ తర్వాత వచ్చి రివ్యూలు రాయండి అంటూ మండి పడ్డాడు. రివ్యూలను బహిష్కరించాలని, తెలుగు సిసినిమాను సేవ్ చేయాలని కోరుతూ రవితేజ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు హైపర్ ఆది.

    English summary
    Kathi Mahesh Review On Touch Chesi Chudu. Touch Chesi Chudu written by Vakkantham Vamsi and directed by Vikram Sirikonda which marks the latter’s directorial debut in Telugu cinema. It features Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor in the lead roles while Freddy Daruwala plays the main antogonist which marks his debut in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X