»   » ఇంకో తమిళ సూపర్ హిట్ తెలుగులో రిలీజ్ కు రెడీ

ఇంకో తమిళ సూపర్ హిట్ తెలుగులో రిలీజ్ కు రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం 'కత్తి'. విజయ్‌తో సమంత తొలిసారిగా జతకట్టింది. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తమిళ వెర్ సూపర్ హిట్ అవటంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని తెలుస్తతంది. రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సార్ ఫార్మలటీస్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది.

ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు.

అనిరుథ్‌ స్వరాలు అందించారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

 'Kaththi' Telugu version on

సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన ఎఆర్ మురుగదాస్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ఇలయతలపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘కత్తి'. ఇప్పటికే తమిళంలో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే తెలియజేశాం.

విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘తుపాకీ' సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ కు తెలుగులో సైతం మంచి మార్కెట్ ఏర్పడింది

ఈ సినిమాపై తెలుగులో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచారం సరిగ్గా సాగితే మంచి విజయం సాధించే అవకాశం పుష్కలంగా వుంది. విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొలవెరి డీ ఫేం అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. గతంలో మురుగదాస్ - విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి' కి సినిమా ఆపేద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నారు.

English summary
Vijay imminent film ‘Kaththi’ Makers are in plans to release the film in first week of March, 2015 to entertain Telugu audiences.
Please Wait while comments are loading...