ద్విపాత్రాభినయం చేస్తున్న వెంకీ హీరోయిన్
నాటి చిత్రంలో హేమమాలిని నటించారు. కొత్త చిత్రానికీ రమేష్ సిప్పీయే దర్శకత్వం వహిస్తారనే వార్తలొచ్చాయి. అది నిజం కాదని రమేష్ కుమారుడు రోహన్ తెలిపారు. ఇప్పుడు బాలీవుడ్ లో ద్విపాత్రాభినయాల జోరు బాగా పెరిగింది. అక్షయ్ కుమార్ హిట్..రౌడ్ రాథోడ్ తో ఈ హవా మరోసారి మొదలయ్యింది. దీనికి కారణం విశ్లేషిస్తూ...ఇంతకు ముందు అక్షయ్ కుమార్‌ను అటు అల్లరి పాత్రలోనూ, ఇటు యాక్షన్ పాత్ర లోనూ చూడాలంటే రెండేసి టిక్కెట్లు కొనాల్సివచ్చేది. అయితే ఒకే టిక్కెట్ లో రెండు పాత్రల్లో అక్షరు ను చూపిం చిన చిత్రం 'రౌడీ రాథోడ్'. బహు శా రెండు రకాల ప్రేక్షకులు రావడం తోనేమో అవలీలగా ఆ చిత్రం వంద కోట్ల వసూలు సినిమాల జాబితాలో చేరిపోయింది అంటున్నారు.
దీంతో బాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ అదే బాటలో పయనిం చాలను కుంటున్నారు. మళ్లీ డ్యూయ ల్ రోల్స్ సినిమాలు తెరకెక్కించాలని ప్రయ త్నిస్తున్నారు. 'సీతా ఔర్ గీతా', 'సత్తే పే సత్తా' సినిమాలను మళ్లీ రీమేక్ చేసేందుకు బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దా లుగా డబుల్ రోల్స్ బాలీవుడ్‌లో ఓ సక్సెస్ ఫార్ములా, నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు రంగ ప్రవే శం చేయడంతో ఈ మధ్య కాలంలో ఈ ఫార్ములాకు కొంత బ్రేక్ పడినా అక్షయ్ సక్సెస్‌తో మళ్లీ ఇప్పుడు అందరూ అదే మంత్రం జపిస్తున్నారు. దానికి తోడు 'బోల్ బచ్చన్' చిత్రం హిట్టవటం...అందులో అభిషేక్ డ్యూయెల్ రోల్‌లో కనిపించటం కూడా ప్లస్ అయ్యింది.
' ఇక నో ఎంట్రీ మే ఎంట్రీ' పేరుతో అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్న సినిమా ఏకంగా ముగ్గురు హీరోలను డబుల్ రోల్స్ లో చూపించనుంది. సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్, ఫర్దీన్‌ఖాన్‌లు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయ నున్నారు. 'సీతా ఔర్ గీతా'లో కత్రినా కైఫ్, 'ఔరంగజేబ్'లో అర్జున్ కపూర్, 'జుడ్వా'లో సైఫ్ అలీ ఖాన్, 'సత్తే పే సత్తా'హ చిత్రంలో సంజరు దత్, 'అజబ్ గజబ్ లవ్'లో అర్జున్ రాంపాల్‌లు డ్యూ యెల్ రోల్స్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే డ్యూయెల్ రోల్స్‌తో వస్తున్న అన్ని సినిమాల్లో ఓ పాత్ర సీరియస్‌గా ఉంటే మరో పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది పాత ఫార్ములా. అయితే కొత్తగా ఈ ఫార్ము లాలో వచ్చే సినిమాల్లో రెండు పాత్రలు కూడా కడుప్పబ్బా నవ్విస్తాయని ఆయా చిత్రాల దర్శ కులు హామీ ఇస్తున్నారు. ఇక 'ద డర్టీ పిక్చర్' సినిమాతో సంచలనం సృష్టించిన విద్యా బాలన్ కూడా త్వరలో ద్విపాత్రాభినయం చేయ నుంది.


Click it and Unblock the Notifications












