»   » ఆ లేడీ డైరక్టర్ నన్ను మోసం చేసింది

ఆ లేడీ డైరక్టర్ నన్ను మోసం చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆమెని నమ్మి సినిమా చేశాను. ఆమె చేసిన తప్పిదానికి నేను బలై పోయాను. ఒక విధంగా ఆ చిత్ర దర్శకురాలు ఫరాఖాన్ నన్ను మోసం చేసింది అని చెప్పాలి అంటూ బాధ పడుతోంది కత్రనాకైఫ్. హిందీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈమె నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె చేసిన షీలాకీ జవానీ. పాట మాత్రం పెద్ద హిట్టయింది. అలాగే ఫరాఖాన్ ఆ సినిమా కథ చెప్పి ఊహల్లోనే నా చేత మేడలు కట్టించింది.

తీరా విడుదలయ్యాక అది పెద్ద ప్లాప్ అని తేలి నా ఆశలన్నీ కూలిపోయాయి. ఇపుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నాను అంటూ కత్రినా తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. అలాగే తాను ఓ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై ఎప్పుడూ ఓ వ్యక్తిని నమ్మి సినిమా చేయననీ, కేవలం కథకే తన మొదటి ప్రాధాన్యతనిస్తానని, సినిమాపై నమ్మకం కుదిరాకే గ్రీన్‌సిగ్నల్ ఇస్తానని అంటోంది కత్రినాకైఫ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu