»   » కన్నింగ్ హీరోయిన్స్: ఆ...విషయాలకు ఓకే, పెళ్లి మాత్రం నో!

కన్నింగ్ హీరోయిన్స్: ఆ...విషయాలకు ఓకే, పెళ్లి మాత్రం నో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ప్రవేశించే హీరోయిన్ల పరిస్థితి ఎలా తయారైందంటే... మహా కన్నింగ్‌ మనస్తత్వంతో పాటు, బాగా కష్టపడే తత్వం ఉంటే తప్ప ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పలువురు తారలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి, అడుగు పెట్టిన తర్వాత ఎదగడానికి ఏం చేయడానికైనా తెగిస్తున్నారు, ఎంత కష్టమైనా పడటానికి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సై అంటున్నారు.

అందుకు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఎదిగిన దీపిక పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి వారే ఉదాహరణ. కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించిన దీపిక పదుకొనె ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంది. ఎంత అందం, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ సినిమా రంగంలో రాణించడానికి పబ్లిసిటీ ముఖ్యమని భావించిన దీపిక పదుకొనె పలువురు యంగ్ హీరోలతో లవ్ ఎపైర్లు నడిపించింది. రణబీర్ కపూర్‌తో ఆమె నడిపిన ప్రేమయాణం అప్పట్లో సంచలనం. కట్ చేస్తూ...బాలీవుడ్లో దీపిక పదుకొనె ఇపుడు నెం.1 హీరోయిన్.

ఇపుడు అదే దారిలో ప్రయాణిస్తోంది కత్రినా కైఫ్. ఆమెకు సెక్సీ గ్లామర్, కష్టపడే తత్వంతో పాటు కాస్త కన్నింగ్ మనస్తత్వం కూడా ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు. గత కొంత కాలంగా కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య సంథింగ్ సంథింగ్ ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి రహస్యంగా విదేశాల్లో ఎంజాయ్ చేసిన వచ్చిన ఫోటోలు కూడా మీడియాకు లీక్ అయ్యాయి. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే కత్రినా మాత్రం రణబీర్ కపూర్‌ను పెళ్లాడటానికి నో అంటోందని, పెళ్లి విషయం ఎత్తే సరికి......కెరీర్ కెరీర్ అంటూ మాట దాట వేస్తోంది. అదంటీ మ్యాటరు..వీళ్లని కన్నింగ్ హీరోయిన్స్ కాకుంటే మరేమనాలి?

English summary
Ranbir Kapoor and Katrina Kaif's alleged love life isn't hidden from anyone. If reports are to be believed then Katrina has apparently declined Ranbir's marriage proposal!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu