»   » ఐష్‌ను బీట్ చేయడమే లక్ష్యంగా కత్రినా కసరత్తు!

ఐష్‌ను బీట్ చేయడమే లక్ష్యంగా కత్రినా కసరత్తు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: సెక్సీయెస్ట్ ఉమన్‌గా పలు ప్రశంసలు... శృంగార నాయకిగా అవార్డులు అందుకున్న హాట్ లేడీ కత్రినా కైఫ్ ప్రస్తుతం ధూమ్3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరింత సెక్సీగా కనిపించేందుకు కసరత్తు చేస్తోంది కత్రినా. ధూమ్ 2 చిత్రంలో ఐశ్వర్య రాయ్ సన్నగా, సెక్సీగా కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచిన నేపథ్యంలో..... ఈ చిత్రంతో ఐష్ అందాలను మరిపించాలని ట్రై చేస్తోందట. రోజూ వర్కౌట్లు చేస్తూ దాదాపు 5 కేజీల వెయిట్ తగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంది.

  ఈ చిత్రం గురించి కత్రినా మాట్లాడుతూ... 'ధూమ్ 3 చిత్రంపై ఆడియన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఫిట్ గా కనిపించేందుకు చాలా కష్ట పడుతున్నాను. రోజు దాదాపు గంటన్నర ఎక్సర్ సైజులు చేస్తున్నాను. డైట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మసాలా వంటలు ఏమీ తినడం లేదు. నాకెంతో ఇష్టమైన చాక్లెట్లు, ఐస్ క్రీములను కూడా దూరం పెట్టాను. సలాడ్లు, ఫిష్ వంటకాలు ఎక్కువగా తింటున్నాను అని' అని చెప్పుకొచ్చింది.

  గతంలో వచ్చిన ధూమ్, ధూమ్2 సినిమాలు బాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్స్‌గా పేలిన నేపథ్యంలో... థూమ్ 3 తీసేందుకు యశ్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అమీర్ సరసన సెక్సీ క్వీన్ కత్రినా లీడ్ రోల్ చేస్తోంది.

  గతంలో వచ్చిన రెండు సిరీస్‌లలో ఇషా డియోల్, ఐశ్వర్యరాయ్, బిపాస బసులతో బికీని వేయించి రోమాన్స్ చేయించారు దర్శక నిర్మాతలు. తాజాగా ధూమ్3 లోనూ కత్రినాతో బికినీ వేయించి అమీర్ ఖాన్ తో రొమాన్స్ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రంలో కత్రినాతో బికినీ వేయించాలని దర్శక నిర్మాతలు ట్రై చేసినా అందుకు కత్రినా నో చెప్పినట్లు బాలీవుడ్ టాక్. యశ్ రాజ్ ఫిలింస్ కు చెందిన ఆదిత్య చోప్రా కత్రినాకు మంచి ఫ్రెండ్ కావడంతో కరీనాను మరీ బలవంతం పెట్టడం ఇష్టం లేక బికినీలు కాక పోయినా బికినీని తలపించే పొట్టి నిక్కర్లు ఆమెతో వేయించాలని నిర్ణయించారట.

  English summary
  Katrina Kaif “People have a lot of expectations on ‘Dhoom 3’ and the intense action sequences require a lean and fit look. I have been exercising for about 1.5 hours daily and I have also been very strict about my diet. I am not eating anything with masala in it. I am also avoiding chocolate and ice creams. My diet has a lot of fish and salads lately to enhance my appearance” she says.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more