For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బర్త్‌డే పార్టీలో ఈ స్దాయిలోనా ,సెలబ్రెటీలంతా హంగామా (వీడియో,ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై : ముంబై లో ప్రతీ రాత్రీ ఎంతో ఘనమైన జరుగుతూంటాయి. అయితే వాటిల్లో సెలబ్రెటీల పార్టీల తీరే వేరు. బాలీవుడ్ సెలబ్రెటీలు వీకెండ్ లలో పార్టీలలో మునిగితేలుతూంటారు. అంతేనా...ఈ సెలబ్రెటీలు పార్టీ చేసుకోవటానికి ఎవరో ఒక స్టార్ పుట్టిన రోజుని వేదికగా చేసుకుంటారు. అలాంటి అదిరిపోయే పుట్టిన రోజు పార్టీ రీసంట్ గా ముంబైలో జరిగింది. అది మరెవరిదో కాదు ..అందాల తార కత్రినాకైఫ్ ది.

  కత్రినాకైఫ్ తన 33 వ పుట్టిన రోజు ని తన సన్నిహితుల మధ్య జరుపుకుంది. బాలీవుడ్ స్టార్స్, ప్రేమలో ఉన్న అలియా భట్ లాంటి వాళ్లు తమ బోయ్ ప్రెండ్స్ తోనూ కుర్ర హీరోలు అర్జున్ కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్ లాంటివాళ్లు వచ్చేసి అదరకొట్టారు.

  వాళ్లతో పాటు డైరక్టర్ కరుణ్ జోహార్, కత్రినా సోదరి ఇసెబెళ్లా కైఫ్, అభయ్ డయోల్, కబీర్ ఖాన్, మిని మాధుర్, అలీ అబ్బాస్ జఫీర్, అభిషేక్ కపూర్, యస్మీన్ కరాచీవాలా, కత్రినా మేనేజర్ రేష్మా శెట్టి లు పార్టీలో పాలుపంచుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆమె తన అభిమానులకు ఓ గిప్ట్ ఇచ్చింది. అందుకోసం ఆమె ఫేస్ బుక్ ఎక్కౌంట్ తెరిచి, ఓ వీడియోని షేర్ చేసింది.

  ఇంకేముంది.. తమకు ఇష్టమైన హీరోయిన్ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచిందని తెలియడం ఆలస్యం అభిమానులు ఆమెకు హ్యాపీ బర్త్‌డే చెబుతూ తమ ఆనందాన్ని కామెంట్స్‌లో పోస్ట్‌ చేశారు.

  దీన్ని నమ్మలేకపోతున్నామని, మా క్వీన్‌ చివరికి ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది, చాలా సంతోషంగా ఉందని, ఆమె పుట్టినరోజున ఇది మంచి ట్రీట్‌ అని కామెంట్స్‌లో పేర్కొన్నారు. కత్రినా ఫేస్‌బుక్‌ ఖాతా తెరచి ఒక్క రోజు కాకముందే.. ఆమె అకౌంట్‌కు 10.4 కే పైగా లైక్‌లు లభించడం విశేషం.

  స్లైఢ్ షోలో బర్తడే ఫొటోలు చూడండి..

  మెరిసిపోయింది

  మెరిసిపోయింది


  ఇక పుట్టిన రోజు వేడుక జరుగుతున్నప్పుడు కత్రినా ఫేస్ చూడాలి. ఎంతలా మెరిసిపోయిందో అనిపిస్తుంది.

   సమక్షంలో

  సమక్షంలో

  తన సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఓ సక్సెస్ ఫుల్ సెలబ్రెటీగా లైఫ్ లీడ్ చేస్తూ పుట్టిన రోజు జరుపుకోవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనటంలో సందేహం లేదు.

  మెరిసిపోయింది

  మెరిసిపోయింది


  ఎర్రటి డ్రస్ లో కత్రినా అధ్బుతమైన అందగత్తెగా మెరిసిపోయింది.

  కష్టమైంది

  కష్టమైంది

  ఆమెనుంచి కళ్లు తిప్పుకోవటం కష్టమైందని చాలా మంది పార్టీకి వెళ్లినవాళ్లు అభివర్ణించారంటే ఆమె పార్టీలో ఎలా ఉందో మీరే అంచనా వేయండి.

   రాకపోయినా

  రాకపోయినా

  హిందీ రాదు.. తెలుగు అంతకన్నా రాదు. కానీ బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ సెలబ్రిటీల్లో ఆమె ఒకరు.

  అదరకొడ్తోంది

  అదరకొడ్తోంది

  డ్యాన్స్‌ అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు ఐటెం పాటలతో బాలీవుడ్‌ను దుమ్ము దులిపేస్తోంది.

  తెలుగులో రెండు

  తెలుగులో రెండు

  'మల్లీశ్వరి'గా పరిచయమై తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'అల్లరి పిడుగు'లా మారింది.

  ముద్దుపేరు

  ముద్దుపేరు

  కత్రినాకైఫ్ కు ... బాలీవుడ్‌ బార్బీడాల్‌ అనే ముద్దుపేరు ఉంది.

  ట్వీట్స్,మెసేజ్ లు

  ట్వీట్స్,మెసేజ్ లు

  శనివారం క్యాట్‌ పుట్టినరోజు సందర్భంగా కత్రినా కైఫ్‌ కు శుభాకాంక్షలు చెబుతూ.. ఎన్నో వేల మెసేజ్ లు , ట్వీట్స్

  అక్కడ పుట్టినా

  అక్కడ పుట్టినా

  కత్రినాకైఫ్‌ బ్రిటన్‌లో పుట్టినా బాలీవుడ్ లో తనకంటూ స్దానం ఏర్పాటు చేసింది

  తల్లి, తండ్రి

  తల్లి, తండ్రి


  కత్రినా తల్లి సూసాన్‌ లాయర్‌, ఛారిటీ వర్కర్‌.

  ఒక చోట నుంచి మరో చోటకి

  ఒక చోట నుంచి మరో చోటకి

  తల్లి జీవితాన్ని ఛారిటీలకు సాయం చేయడానికే అర్పించాలనుకుంది. దీంతో కత్రినా కుటుంబం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి.

  నెలలు పాటు

  నెలలు పాటు

  అలా బ్రిటన్‌ నుంచి చైనా, జపాన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, పోలాండ్‌, బెల్జియం, హవాయిల్లో కొన్ని నెలలపాటు నివాసం ఉందా కుటుంబం.

  ఫైనల్ గా...

  ఫైనల్ గా...

  ఫైనల్ గా అన్ని దేశాలు తిరిగి ఆ కుటుంబం ఆఖరికి లండన్‌లో స్థిరపడ్డారు.

  సంతోషంగా...

  సంతోషంగా...

  కత్రినా ఈ సందర్భంగా ఇంట్లో దిగిన ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

  ఫొటోను...

  ఫొటోను...

  కత్రినా ప్రొఫైల్‌గా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను, బ్యాక్‌గ్రౌండ్‌లో బీచ్‌ ముందు నిలుచున్నట్లు కనబడుతున్న ఫొటోను ఉంచారు.

  రెండో స్దానం

  రెండో స్దానం

  గూగుల్‌లో గత పదేళ్లలో నెటిజన్లు ఎక్కువగా వెతికిన భారతీయ నటీమణుల్లో కత్రినాకైఫ్‌ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

  మొదట రోజే రికార్డ్

  మొదట రోజే రికార్డ్


  క‌త్రినా కైఫ్ కొత్తగా ఓపెన్ చేసిన ఫేస్ బుక్ అకౌంట్‌కు 36ల‌క్ష‌ల లైక్‌లు మొదటి రోజే రావటం అందరినీ షాక్ కు గురి చేసింది.

  పోస్ట్ చేసాడు

  పోస్ట్ చేసాడు

  కత్రినా ఖాతా తెరిచిన క్ష‌ణం నుంచే ఆమెకు హ్యాపీ బర్త్‌డే చెబుతూ తమ ఆనందాన్ని కామెంట్స్‌లో పోస్ట్‌ చేశారు.

  ట్వీట్స్ తోనూ..

  ట్వీట్స్ తోనూ..  మా క్వీన్‌ చివరికి ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది, చాలా సంతోషంగా ఉందని, ఆమె పుట్టినరోజున ఇది మంచి ట్రీట్‌ అని ట్విట్స్ పోస్ట్ చేశారు

  మళయాళంలో

  మళయాళంలో


  హిందీలోనే కాకుండా కత్రినా మళయాళంలోనూ నటించింది. బలరాం వర్సెస్‌ తారాదాస్‌ అనే చిత్రంలో కత్రినా మమ్ముటితో కలిసి నటించింది.

  English summary
  One of the most happening parties of the year took place at Katrina Kaif's pad where all her close pals came together to ring in her 33rd birthday. From the alleged love birds, Alia Bhatt to Sidharth Malhotra to B-town heartthrobs Aditya Roy Kapur and Arjun Kapoor, many celebs spotted at the birthday bash.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X