»   » కత్రినా చెయ్యివిరిగిందా... ఆ కట్టు చూస్తే మరీ

కత్రినా చెయ్యివిరిగిందా... ఆ కట్టు చూస్తే మరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నా మొన్నటివరకూ పెద్దగా పనేం లేకుండా ఉండిపోయింది కత్రినా. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే క్యాట్ కొన్నాళ్ళు గా మరీ నల్లపూస అయిపోయింది. రణబీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ అనే చిత్రం ఒక్కటేఇప్పుడు చేతిలో ఉన్న సినిమా. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.

ఇక ఈ మూవీతో పాటు త్వరలో ఏక్ థా టైగర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టైగర్‌ జిందా హై అనే మరో సినిమాలోనూ చేస్తోంది. ఇందులో క్యాట్స్ పాత హీరో అయిన సల్మాన్ హీరోగా నటించనున్నాడు. అయితే తన సినిమాలకు సంబంధించిన విషయాలనే కాక పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే క్యాట్ తాజాగా ఒక పాత కారు ముందు కూర్చొని ఉన్న ఫోటో పోస్ట్ చేసింది.

ఫోటో, ఫోజూ రెండూ బాగానే ఉన్నాయి కానీ కత్రినా ఎడమచేతిని చూసిన అభిమానులకే ఒక్కసారి షాక్ తగిలింది. ఎందుకంటే ఎడమ మోచేతి వరకూ చేయ్యి విరిగినప్పుడూ వేసే ప్లాస్టర్ ఆఫ్ పారీస్ పట్టీ కనిపించటమే. దానికి తగ్గట్టే "సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉన్నా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలి" అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఒకటి తగిలించేసింది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్నారంతా. ఈ చేయ్యి కట్టు వేషమంతా తాజా సినిమా జగ్గా జుసూస్ ప్రమోషన్ కోసమట.

 Katrina Kaif seems to have fractured her Left hand

స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా.. ప్రస్తుతం యువ హీరోలతోనే ఎక్కువగా జోడీ కడుతోంది. కెరీర్‌లో ఎక్కువ విజయాలు అందుకున్న సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లతో ఈ భామ నటించి చాలా రోజులే అవుతోంది. దీంతో అభిమానులు ఆమె సల్మాన్‌, అక్షయ్‌లతో మరోసారి నటించాలని ఆశపడుతున్నారు. 'ఏక్‌ థా టైగర్‌'కి సీక్వెల్‌గా తెరకెక్కనున్న 'టైగర్‌ జిందా హై' చిత్రంలో సల్మాన్‌తో కత్రినా తెరను పంచుకోనుండడంతో ఫ్యాన్స్ ఆశ కొంతమేర ఫలించినట్టే.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా తాజాగా 'టైగర్‌ జిందా హై' షూటింగ్‌ మొదలైంది. 'టైగర్‌ జిందా హై' షూటింగ్‌ ప్రస్తుతం మొరాకోలో జరుగుతున్నట్టు ఆ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెలిపారు. 2012లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'ఏక్‌ థా టైగర్‌'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. యశరాజ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాత. క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 22న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు దర్శకుడు ట్విట్టర్‌లో తెలిపారు.

English summary
Katrina Kaif posted this snapshot yesterday from the set of 'Jagga Jasoos'. In the picture, Kat's hand appears to have been fractured. Don't worry, that's part of the character get-up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu