»   » కత్తి సాము.. గన్ షూటింగ్: సినిమా కోసమే అయినా అమ్మడి కష్టం మామూలుగా లేదు

కత్తి సాము.. గన్ షూటింగ్: సినిమా కోసమే అయినా అమ్మడి కష్టం మామూలుగా లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు, అందాల ఆరబోతకే పరిమితం కెరీర్ కొత్తల్లో కత్రినా మీద వచ్చిన కంప్లైంట్స్ ఇవి. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అభియోగాన్నీ అధిగమిస్తూ వచ్చింది ఇప్పుడు డ్యాన్సులు కూడా ఇరగదీసేస్తోంది. స్టేజ్ డ్యాన్సుల విషయంలో కూడా హై లెవెల్ పెర్ఫామెన్స్ తో కుమ్మేస్తోంది. సల్మాన్ తో ప్రేమాయణం ఫెయిల్యూర్ తో కొంతకాలం తడబడ్డా మళ్ళీ నిలదొక్కుకుంది, కెరీర్ పీక్ స్టేజ్ కు చేరుకున్నాక.. రణబీర్ తో లవ్ అఫైర్.. బ్రేకప్. మళ్ళీ పోరాటం, ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో కాసింత ఇబ్బంది పడుతున్న కేట్. ఇప్పుఇడు మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ జిందాహై చిత్రంలో నటిస్తోంది.

 జగ్గా జాసూస్

జగ్గా జాసూస్

ఒకవైపు సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ప్రమోషన్స్ చేసుకుంటుంటే.. మరోవైపు జగ్గా జాసూస్ ను ప్రమోట్ చేసుకోవడంలో బిజీగా ఉంది కత్రినా. అయితే.. ఇదే సమయంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న టైగర్ జిందా హై పనులు కూడా చక్కబెట్టేస్తున్నారు సల్మాన్ అండ్ కేట్.

కత్తి సాము.. గన్ షూటింగ్ కూడా

కత్తి సాము.. గన్ షూటింగ్ కూడా

వీరిద్దరూ ఈ మూవీ కోసం తెగ కష్టపడిపోతున్నారు. టైగర్ జిందా హై కోసం కత్తి సాము.. గన్ షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేసేస్తున్నారు. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న టైగర్ జిందా హై చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

బస్టర్‌ రీవ్స్‌ లాంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్

బస్టర్‌ రీవ్స్‌ లాంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్

టామ్‌ స్ట్రతర్స్‌, బస్టర్‌ రీవ్స్‌ లాంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్ దీనికి పనిచేస్తున్నారు. ‘డార్క్‌ నైట్‌ రైజెస్‌' లాంటి బ్యాట్‌మేన్‌ చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలు రూపొందించిన టామ్‌ ‘టైగర్‌..'కు అంతేస్థాయిలో గొప్ప పోరాటాల్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఫ్రాన్స్‌, యూకే, స్పెయిన్‌కు చెందిన స్టంట్‌మేన్‌లు చాలామంది ఈ చిత్రానికి పనిచేస్తున్నారట.

టైగర్‌ జిందా హై

టైగర్‌ జిందా హై

‘టైగర్‌ జిందా హై'. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఓ పక్క ‘జగ్గా జాసూస్‌' ప్రచారంలో కత్రినా... ‘ట్యూబ్‌లైట్‌' ప్రమోషన్‌లో సల్మాన్‌ తీరిక లేకుండా ఉన్నారు. అయినా ‘టైగర్‌ జిందా హై'ను వదల్లేదు. ఆ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు ఈ ఇద్దరూ. అందులో భాగమే కత్రినా చేస్తున్న కత్తిసాము, గన్‌ షూటింగ్‌.

హాలీవుడ్ టెక్నీషియన్స్

హాలీవుడ్ టెక్నీషియన్స్

టైగర్ జిందా హైలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకొచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు సల్మాన్.. కేట్. గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కత్రినా కైఫ్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్.. 'ఫిమేల్ టైగర్ గాండ్రించడానికి రెడీ అవుతోంది' అంటూ ట్వీట్ చేసింది.

English summary
Bollywood star Katrina Kaif recently shot some action sequences for her upcoming film opposite Salman Khan, Tiger Zinda Hai and she was killing it. See pics from the sets in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu