»   » ఆ రాత్రి రిక్షా ఎక్కి ఇంటికెళ్ళిన కత్రినా కైఫ్

ఆ రాత్రి రిక్షా ఎక్కి ఇంటికెళ్ళిన కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్య ఓ రాత్రి రిక్షా ఎక్కి ఇంటికి బయిలుదేరింది కత్రినా కైఫ్. ఆమెను చూసినవారు గుర్తు పట్టినా ఆమె రిక్షా ఎక్కడమేమిటనే అనుమానంతో వెంబడించలేదు. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్న విద్యాబాలన్, నసీరుద్దీన్ షా నటించిన 'ఇష్కియా' చిత్రం ముంబయి నగర శివార్లలోని మల్టీప్లెక్స్ లో ప్రదర్శిస్తుండటంతో ఆ చిత్రాన్ని చూసేందుకు కత్రినా వెళ్లింది. సినిమా విడిచిపెట్టేసరికి రాత్రి 10.30 దాటింది. ధియోటర్ నుంచి రహస్యంగా తన ఐడెంటిటి బయిట పడకుండా వచ్చిన ఆమె తన డ్రైవర్ ను కారు తీసుకురమ్మంటూ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయితే సెల్ సిగ్నల్స్ పనిచేయక ప్రయోజనం లేకపోయింది. మరో ప్రక్క జనం ఒక్కొక్కరో కత్రినాను గుర్తుపట్టి గుమిగూడటం మొదలెట్టారు. జనం గుమిగూడితే ఎదురయ్యే ప్రమాదాన్ని ఊహించిన కత్రినా వెంటనే ఆ పక్కనే ఉన్న రిక్షాలో తన మేనేజర్ తో సహా ఎక్కి కూర్చుంది. వెంటనే తన ఇంటి వైపు ప్రయాణం సాగించింది. కత్రినా బాడీగార్డ్ లు మరో రిక్షాలో ఆమె వెనకే బయిలుదేరారు. అలా రిక్షాలో అంధేరి నుంచి బాంద్రా వరకూ కత్రినా కైఫ్ ప్రయాణించి వార్తల్లో నిలిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu