»   » సల్మాన్ ఇంట్లో ఓ రోజంతా కత్రినా కైఫ్

సల్మాన్ ఇంట్లో ఓ రోజంతా కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీరంగంలో తోటి హీరోయిన్లకు వణుకు పుట్టిస్తూ బాలీవుడ్‌ అందాల తార కత్రినా కైఫ్. తన జన్మదినం సందర్భంగా తన ఇంటికి సరిగ్గా రెండు బ్లాకుల అవతలేవున్న ఒక సుందరమైన ఛైనీస్ రెస్టారెంట్లో ఈ నెల 15న విందుకుగాను ఒక టేబుల్ బుక్ చేసింది. ఆమె యిచ్చిన విందులో బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, వేక్ అప్ సిడ్ అయన్ ముఖర్జీ, కబీర్ ఖాన్ (న్యూయార్క్), సల్మాన్ చిన్న సోదరి అల్విరా అగ్నిహోత్రి పాల్గోన్నారు. మరుసటిరోజు, జన్మదినం అయిన జూలై 16న కొంత సమయం మీడియా తెలిపినట్లు వేడుకల హడావిడిలో గడిపింది. అయితే, ఎవరికీ తెలియని విషయం ఏమంటే- అదే రోజు ఆమె బేండ్ స్టాండ్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ లోని సల్మాన్ ఖాన్ ఇంట్లో లంచ్ కు హాజరయింది.

ప్రత్యక లంచ్ మెనూలో నోరూరించే ఖీమా-పావ్, రాజ్మా చావల్ ఇంకా ఖాన్ కుటుంబసభ్యులు అందించిన ఇతర వంటకాలన్నీ తన డైటింగ్ నిబంధనలన్నీ పక్కన బెట్టి ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా కడుపారా లాగించేసిందని తెలుస్తోంది. తర్వాత అదే రోజు సాయంత్రం తన పర్సనల్ అసిస్టెంట్ తో కలసి తాను నటించబోతున్న 'ఏక్ ధా టైగర్" ఫిలిం టెస్టులకు హజరైంది. కత్రినా ఫిలిం టెస్టులకు సల్మాన్ కూడా కలసి రావలసి వున్నప్పటికి, పాపం... సల్మాన్ త్వరలో విడుదల కానున్న తన 'బాడీగార్డ్" ఫిలిం పాట షూటింగ్ కు పాన్వేల్ లోని తన పొలంలో వుండిపోయాడు !

English summary
The next day July 16(her birthday) Katrina spent a part of her day promoting ZNMD as is reported in the media. But what no one knows is that she then drove to Salman's house(Galaxy Apartments, Bandstand) for a special birthday lunch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu