»   » కట్టప్ప పాత్రకు సత్యరాజ్ కంటే ముందు.... ఎవరిని అనుకున్నారో తెలుసా?

కట్టప్ప పాత్రకు సత్యరాజ్ కంటే ముందు.... ఎవరిని అనుకున్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంత కీలకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ పాత్రను పోషించిన తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేసాడు. ఆ పాత్రలో సత్యరాజ్ మినహా మరెవరినీ ఊహించుకోలేనంతగా జీవించాడు.

అయితే కట్టప్ప పాత్రకు తొలుత సత్యరాజ్ ను తీసుకోవాలనుకోలేదట. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తో చేయించాలని ప్లాన్ చేసారు. మరి డేట్స్ అడ్జెస్ట్ కాలేదో? ఇంకేమైనా కారణం ఉందో తెలియదు కానీ ఆయన ఈ పాత్ర చేయలేక పోయారు. దీంతో తర్వాత సత్యరాజ్ ను కట్టప్ప పాత్ర కోసం ఎంపిక చేసారట.


మంచి పాత్ర మిస్సయ్యారు

మంచి పాత్ర మిస్సయ్యారు

ముందు ఈ పాత్రకు మోహన్ లాల్ ను అనుకున్నారని తెలిసిన అభిమానులు.... ఆయన ఒక మంచి పాత్ర మిస్సయ్యారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు శివ గామి పాత్రకు రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని, అవంతిక పాత్రకు తమన్న కంటే ముందు సోనమ్ కపూర్ ను తీసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే.
చరిత్రలో నిలిచే సినిమా

చరిత్రలో నిలిచే సినిమా

బాహుబలి లాంటి చిత్రాల్లో నటించే అవకాశం లైఫ్ లో ఒకసారి మాత్రమే లభిస్తుందని, అలాంటి సినిమా రావడమే అరుదు. ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే బాహుబలి లాంటి సినిమాల్లో అవకాశం వదులు కోవడం అంటే..... లైఫ్‌లో ఓ మంచి అవకాశం వదులు కోవడమే అని పలువురు యాక్టర్స్ అభిప్రాయ పడుతున్నారు.


బాహుబలి మిస్సయినా భారతంలో ఛాన్స్

బాహుబలి మిస్సయినా భారతంలో ఛాన్స్

బాహుబలి సినిమాను మోహన్ లాల్ మిస్సయినప్పటికీ ఆయనకు మరో భారీ అవకాశం దక్కింది. రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోయే సినిమాలో అవకాశం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి-2

బాహుబలి-2

ఓ వైపు బాహుబలి-2 కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే..... మరో వైపు ఈ సినిమాను నష్టపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Latest reports in media circles suggest that Malayalam superstar Mohanlal was the first choice of Rajamouli to play the loyal Kattappa in Baahubali. Mohanlal rejected the role as he couldn't allot the bulk dates sought by the ace Telugu filmmaker. Rajamouli may not have any complaints as Sathyaraj played the role to perfection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu