»   »  ట్రైలర్‌కు అదిరే స్పందన...శృతిహాసన్ ట్వీట్

ట్రైలర్‌కు అదిరే స్పందన...శృతిహాసన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిన్న ( ఆదివారం) సాయంత్రం విడుదలైన కట్టీబట్టీ ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది. ట్రైలర్‌ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వీక్షించిన పలువురు సినీ రంగ ప్రముఖులు దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ ట్రైలర్ ని మీరూ విక్షించండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషికపూర్‌, నటి శృతి హసన్‌, మిని మాథుర్‌, నటుడు ఫరాన్‌ అక్తర్‌, ప్రముఖ దర్శకులు అనురాగ్‌ కశ్యప్‌, తదితరులు ఈ వినూత్న ట్రైలర్‌పై తమ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శృతిహాసన్ ట్వీట్ చేస్తూ....

అనురాగ్ కాస్యప్ ట్వీట్ చేస్తూ....

కంగనా రనౌత్ విషయానికి వస్తే...

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ ఒక్కసారైనా జాతీయ పురస్కారం అందుకోవాలని కలలు కంటుంటారు. అలాంటిది కంగనా రనౌత్‌ 28 ఏళ్ల వయసుకే రెండు జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. వాటి వల్ల తన జీవితం అద్భుతంగా ఏమీ మారిపోలేదంటోంది కంగన.

ఓ కార్యక్రమంలో భాగంగా అభిమానులను కలుసుకున్న కంగనా ఆ విషయమై తన భావాలను పంచుకుంది. ''క్వీన్‌'తో రెండో జాతీయ పురస్కారాన్ని సాధించాక నా జీవితంలో పెద్ద మార్పేం రాలేదు. కాకపోతే నా ప్రతిభను పరిశ్రమ గుర్తించడం మొదలెట్టింది'' అని చెప్పింది కంగన. ఇప్పుడు తనకు వస్తున్న అవకాశాల పట్ల కంగన సంతృప్తి వ్యక్తం చేసింది.

 Katti Batti's Latest Trailer Is Here & It's Super Fun!

''తమ సినిమాల్లో నటించమంటూ ప్రముఖ దర్శకులు సహా ఎంతోమంది నన్ను సంప్రదిస్తున్నారు. మహిళా ప్రాధాన్య చిత్రాల్లోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇది నాకెంతో ఆనందాన్నిస్తోంది'' అంది కంగన.

'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌', 'కట్టీ బట్టీ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది కంగన. మీనా కుమారి జీవితకథతో రూపొందనున్న చిత్రంలో నటించేందుకూ కంగనా రనౌత్‌ అంగీకరించినట్టు సమాచారం.

English summary
The much awaited trailer of Kanagana Ranaut and Imran Khan starer Katti Batti is finally here! The trailer establishes that Madhav (Imran) is the “the heartbroken” and Payal (Kangana) is “the heartbreaker.” We’re also told that the film is “not a love story,” which had only intrigued us more. Kangana is obvioulsy owing every frame she’s in and her chemistry with Imran is fresh and infectious.
Please Wait while comments are loading...