»   »  కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ప్రారంభం, కేసీఆర్ పాత్రలో ఎవరంటే?

కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ప్రారంభం, కేసీఆర్ పాత్రలో ఎవరంటే?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  CM KCR's Life History Will Be Made A Biopic As Udyama Simham

  తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) జీవితం ఆధారంగా సినిమా ప్రారంభమైంది. 'ఉద్యమ సింహం' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో గురువారం లాంచ్ అయింది. ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తుండగా కల్వకుంట్ల నాగేశ్వరరావు పద్మనాయక ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగింది.

  కేసీఆర్ పాత్రలో ఎవరంటే?

  కేసీఆర్ పాత్రలో ఎవరంటే?

  ఈచిత్రంలో కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ కనిపించబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆయన నడిచే విధానం, హావభావాలను నాజర్ కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగే సినిమా

  తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగే సినిమా

  ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కేసీఆర్ చిన్నతనం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన సాధించిన విజయాలు తదితర అంశాలు ఇందులో చూపించబోతున్నారు. 2009 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రముఖంగా ఫోకస్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో సినిమా ముగుస్తుందని సమాచారం.

  ఆ రోజునే విడుదల

  ఆ రోజునే విడుదల

  ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు సినిమా విడుదల చేయడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. 2009.. నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర అవిర్భావ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఈ రోజు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తర్వాత చోటు చేసుకున్నపరిణామాలు డిసెంబర్ 9న తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయబోతుస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేలా చేసింది. ఆ ప్రకటనతో కేసీఆర్ దీక్షను విరమించారు.

  వరుస బయోపిక్‌లు

  వరుస బయోపిక్‌లు

  తెలుగునాట ప్రస్తుతం వరుసగా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రం జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి' సూపర్ హిట్ అవ్వగా.... ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర' చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇపుడు కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహ' ప్రారంభం అవ్వడంతో 2019 ఎన్నికల ముందు వరుస బయోపిక్‌లు తెలుగు ప్రేక్షకులను ముంచెత్తనున్నాయి.

   త్వరలో షూటింగ్

  త్వరలో షూటింగ్

  ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటుల వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.

  బేనర్: పద్మనాయక ప్రొడక్షన్స్
  కథ-నిర్మాణం: కల్వకుంట్ల నాగేశ్వరరావు
  సహ నిర్మాత: మేక నాగేంద్ర
  రచన: కాంచనపల్లి రాజేంద్రరాజు
  కెమెరా: ఉదయ్ కుమార్
  సంగీతం: వరికుప్పల యాదగిరి
  ఎడిటర్: నందమూరి హరి
  ఆర్ట్ డైరెక్టర్: హరి బాబు
  స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అల్లూరి కృష్ణం రాజు

  English summary
  Few days it is heard that Special Telangana Movement chief and the Present Chief Minister KCR's life history will be made a biopic. In this context, todayKCR's biopic was launched in Annapurna Studios in a grand manner here today in Hyderabad. Alluri Krishnam Raju will be directing the film while Kalvakuntla Nageshwara Rao will Produce the film. The film is entitled as 'Udyama Simham'. The Pooja ceremony was attended by film unit along with Several celebrities.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more