»   »  కేసీఆర్ కూడా... బాహుబలి చూస్తున్నారోచ్!

కేసీఆర్ కూడా... బాహుబలి చూస్తున్నారోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకలోకం అంతా ప్రస్తుతం బాహుబలి మేనియాలో మునిగిపోయారు. గత వారం రోజులుగా ఈ సినిమా టికెట్ల కోసం జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తాజాగా బాహుబలి సినిమా మేనియా పొలిటీషియన్స్ ను కూడా తాకింది. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించేలా ఈ సినిమా తీయడమే ఇందుకు కారణం.

 KCR to watch Baahubali

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ‘బాహుబలి' సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన కోసం జులై 11న రాత్రి ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ షోకు కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు ‘బాహుబలి' సినిమా గురవారం అర్థరాత్రి బెనిఫిట్ షోలతో ప్రారంభం అయింది. అభిమానులు సినిమా చూసి అద్భుతం అని అంటున్నారు. అయితే క్రిటిక్స్ నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని, గ్రాండ్ లుక్ ఉందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందని అందరూ ఒప్పుకుంటున్న మాట.

English summary
Telangana Chief Minister KCR is going to watch the historical epic drama on Saturday (11th July) night.
Please Wait while comments are loading...