»   » బాక్సాఫీస్ లపై ‘కేడి’ దాడి రేపటి నుండే!

బాక్సాఫీస్ లపై ‘కేడి’ దాడి రేపటి నుండే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా హీరోయిజానికి సరికొత్త భాష్యం చెప్పిన కథానాయ కుడు అక్కినేని నాగార్జున. మూస పాత్రలకు, మూస నటనకు గుడ్‌బై చెప్పి తనదైన ఫక్కీలో నటించడం మొదలుపెట్టి ప్రతి సినిమాకీ ఓ వైవిధ్యాన్ని క్వాలిటీపరంగా ప్రదర్శించి భారత చలన చిత్ర పరిశ్రమలో 'ఐడెంటిటీని సాధించుకున్న హీరోగా నాగార్జునని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తి, భక్తి, రక్తి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేయగల సత్తా వున్న హీరో నాగ్. తను నటించిన 'కేడి" చిత్రం సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిపై చేయించుకొని మహాశివరాత్రికి వాయువేగంతో చిత్రం రిలీజ్ కి సిద్దంమౌతోంది.

కేడి లో నాగార్జున సరికొత్త గెటప్ లో కొత్త స్క్రీన్‌ప్లేతో కొత్తగా వుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. కొత్త హీరోయిజం, సరికొత్త క్లైమాక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శ కుడు కిరణ్‌ 'కేడిని తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఆయనపాత్ర పూర్తి వినోదాన్ని పంచుతుంది. మమత నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మరో కొత్త నాయిక లిండా కూడా బాగా నటించింది. గోవాలో కథ జరుగు తుంది. యాక్షన్‌ సన్నివేశాలు, పాటలు అద్భుతంగా వచ్చాయి. ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా నాగ్ కేరెక్టరైజేషన్‌ చక్కగా రూపొందించారని కార్డ్స్‌ వాడుకుంటూ కేడి వేషాలేసే పాత్రతో ప్రతి సన్నివేశంలో ప్రశ్న, జవాబు వుంటూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తూ, మాస్‌కు బాగా దగ్గరగా వుంటుంది. నాగ్ గత చిత్రాలైన సూపర్, నిన్నే పెళ్ళాడుతా" లకు సంగీతాన్ని అందించిన సందీప్ చౌత మ్యూజిక్ మరో హైలెట్ అని చెప్పకనే చెబుతున్నారు. చిత్ర దర్శకుడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu