»   » నాగ్ ‘కేడి’ ట్రిఫుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఫిబ్రవరి 5

నాగ్ ‘కేడి’ ట్రిఫుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఫిబ్రవరి 5

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింగ్ నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'కేడి" షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షపన్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ లో జరగనుంది.

ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'నాగార్జున గారితో మా బ్యానర్ లో తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిం 'కేడి". సందీప్ చౌతా మ్యూజిక్ చేసిన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఫిబ్రవరి 5న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న 'కేడి"ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ చిత్రంగా 'కేడి" నిలుస్తుంది" అన్నారు.

'కింగ్" నాగార్జున , మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా, ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న 'కేడి" చిత్రంలో 'స్లమ్ డాగ్ మిలియనీర్" ఫేం అంకుర్, 'బండిట్ క్వీన్" ఫేం నిర్మల్ పాండే, లగాన్ ఫేం అఖిలేంద్ర మిశ్రా, 'డాన్" విలన్ కెల్లీడార్జ్, షాయాజిషిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu