»   » ‘కీచక’ సినిమాపై ఆందోళన, ఉద్రిక్తత

‘కీచక’ సినిమాపై ఆందోళన, ఉద్రిక్తత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో విడుదల కాబోతున్న ‘కీచక' సినిమాపై మహిళలు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. స్త్రీలపై హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఫిలించాంబర్ వద్ద కీచక చిత్ర యూనిట్ సభ్యులను తెలంగాణ ఎరుకల మహిళా సంఘానికి చెందిన కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడకు చేరుకుని సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చిత్రాన్ని నిషేదించాలని, మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేసారు. ఈ క్రమంలో తోపులాట, అరుపులతో గందరగోళం నెలకొంది. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కీచక సిన్మాను నిషేధించాలని ఎరుకల మహిళా సంఘం అధ్యక్షురాలు ఎమ్. శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడ్డారంటూ యూనిట్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

అయితే సినిమా యూనిట్ సభ్యుల వాదన మరోలా ఉంది. సినిమాలో గొడవ చేసేంత ఏమీ లేదు. ప్రేక్షకులను తప్పుదోవపట్టించే ప్రయత్నం అస్సలు చేయలేదు. ఘోరమైన నేరాల నేపథ్యంలో అప్పట్లో వచ్చిన దండుపాళ్యం సినిమాను ఆదరించిన ప్రేక్షకులను ఈ సినిమాను ఆదరిస్తారని భావివిస్తున్నామని అంటున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత పర్వతరెడ్డి మాట్లాడుతూ...సినిమాలో మంచి మెసేజ్ ఉంది, మహిళలను చైతన్య పరిచే విధంగా మా సినిమా ఉంటుందే తప్ప కించపరిచే విధంగా ఉండదు. 150 నిమిషాల సినిమాను కేవలం ఐదు నిమిషాల టీజర్ చూసి తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకోవడం సరికాదు. ఇలా చేస్తే అసలు సినిమాలే తీయలేం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ప్రధాన సమస్యను, వాస్తవం జరిగిన ఓ సంఘటను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం అన్నారు.

స్లైడ్ షోలో కీచక మూవీ టీం ప్రెస్ మీట్ ఫోటోలు

దర్శకుడు

దర్శకుడు

ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ..నాగ్ పూర్ లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా చిన్న మార్పులు చేసి సినిమా తీసాం. కొన్ని సీన్లు లీక్ కావడంపై సినిమాపై చెడు అభిప్రాయం ఏర్పరుచుకోవడం సరికాదు అన్నారు.

వల్గారిటీ

వల్గారిటీ

సినిమాలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. అత్యాచారాలు చేసే వారికి వార్నింగ్ లా సినిమా ఉంటుంది అన్నారు.

అలాంటివి లేవు

అలాంటివి లేవు

పెద్ద సినిమాల్లో ఉన్నట్లు వల్గారిటీ, డబల్ మీనింగ్ డైలాగులు ఇందులో లేవు. మేం చెప్పాలన్న విషయాన్ని నేరుగా, కాస్త కఠినంగా చెప్పామే తప్ప వల్గర్ గా చెప్పలేదు, సినిమా చూసిన తర్వాత ప్రేక్షులను మేం చెప్పిన విషయాన్ని అంగీకరిస్తారు అన్నారు.

నటీనటులు

నటీనటులు

యామినీ భాస్కర్, జ్వలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేస్తున్నారు.

English summary
Keechaka releasing on 30 October, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu