»   » రేప్ చేస్తావా అంటూ... ( ‘కీచక’ ట్రైలర్)

రేప్ చేస్తావా అంటూ... ( ‘కీచక’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :యామినీ భాస్కర్, జ్వాలకోటి ప్రధాన తారాగణంగా గౌతమీ టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిషోర్‌కుమార్ పర్వతరెడ్డి రూపొందించిన క్రైమ్, థ్రిల్లర్ చిత్రం ‘కీచక'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల హైదరాబాద్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్‌ను విడుదల చేశారు. యదార్ద సంఘటనతో రూపొందిన చిత్రంగా చెప్పబడుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు అందరి మన్ననలూ పొందుతోంది. ఆ ట్రైలర్ ని మీరూ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మిణుగురులు' చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన అతని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని తెలిపారు.

దర్శకుడితో తనకు ఏడెనిమిది సంవత్సరాలుగా పరిచయం ఉందని, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చూస్తుంటే సంతోషంగా వుందని, దర్శకుడిగా అతడికి మంచి పేరు వస్తుందని ఎన్.శంకర్ తెలిపారు. మంచి కథతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, కథలకు మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చే చౌదరి ఈ సినిమా కూడా బాగా తీసి ఉంటాడని జర్నలిస్టు ప్రభు తెలిపారు.

Keechaka Telugu Movie Trailer

కార్యక్రమంలో అనీల్ రావిపూడి, యామినీ భాస్కర్, జ్వాలకోటి, ఎన్.వి.బి.చౌదరి, కిషోర్‌కుమార్ పర్వతరెడ్డి, జోస్యభట్ల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌లో విడుదల కానున్ చిత్రంగురించి దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. '' అని తెలిపారు.

శ్రీ గౌతమి టాకీస్‌ పతాకంపై కిశోర్‌ పర్వతరెడ్డి నిర్మిస్తోన్న ఈ ‘కీచక' చిత్రంలో...రఘబాబు, గిరిబాబు, బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, శివన్నారాయణ, రజిత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్ యాదవ్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి, రచన, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.

English summary
Keechaka Telugu movie trailer starring Jwala Koti, Yamini Bhaskar, Raghu Babu, Giri Babu among others. Directed by N.V.B. Chowdary, produced by Kishore Parvathareddy, music composed by Dr Josyabhatla.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu