»   » నాకన్నా రాజమౌళి 12 ఏళ్ళు చిన్న అయినా...

నాకన్నా రాజమౌళి 12 ఏళ్ళు చిన్న అయినా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకన్నా రాజమౌళి 12 ఏళ్ళు చిన్న. ఇప్పుడు 'మర్యాదరామన్న'కు పనిచేస్తున్నాను. కథను అనుసరించి సంగీతాన్ని చేసుకుంటూ పోతే ఈ అంతరాలు కనిపించవు. కానీ సంగీత, సాహిత్యరంగాల్లో సినిమాల్లో పనిచేయాలనుకునే వారికి కనీసం 25 ఏళ్ళు ఉండాలన్నది నా అభిమతం.ఇక 'స్టూడెంట్‌ నెం.1' నుంచి 'మగధీర' వరకూ రాజమౌళితో మీరు చేసిన చిత్రాల్లోని పాటలన్నీ బాగుంటాయి. ఆయన సినిమా అనగానే మరింత శ్రద్ధ వహిస్తారా అని అండుగుతూంటారు. అయితే నిజం చెప్పాలంటే...అలాంటిదేం లేదు. ప్రతి సినిమాకి ఎంత కష్టపడతానో రాజమౌళి సినిమాకీ అంతే. దర్శకుడు ఎవరైనా నాకు కథ నచ్చి, స్క్రిప్టు పక్కాగా ఉంటేనే రంగంలోకి దిగుతాను. అవి రెండూ బాగుంటే మంచి పాటలకు అవకాశం ఉంటుంది. రాజమౌళి స్క్రిప్టు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అందుకే పాటలు కూడా బాగుంటాయి. 'మర్యాద రామన్న'లో మంచి సంగీతం అందివ్వడానికి అవకాశం చిక్కింది. ముఖ్యంగా 'తెలుగమ్మాయి..' అనే పాట అందరికీ నచ్చుతుంది అంటూ తన మనస్సులో మాటలు చెప్పుకొచ్చారు కీరవాణి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu