ఇష్టమైన తెలుగు హీరో అతనే: కీరవాణి
వ్యంగ్యం, చమత్కారం, వెటకారం ఇవన్నీ నాకు బాగా ఇష్టం. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నా నేను ఇష్టపడతాను. మన హీరోల్లో అలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకొన్నవారు రవితేజ. అందుకే రవితేజ సినిమాలన్నీ క్రమం తప్పకుండా చూస్తూనే ఉంటాను అంటూ తన మనస్సులో మాటను బయట పెట్టారు ప్రముఖ సంగీత దర్సకుడు కీరవాణి. ఆయన ఈ రోజు(సోమవారం) యాభయ్యో పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఇక రవతేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు చిత్రానికి ఆయన సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే పదాల మీద మమకారం కురిపించడానికి స్ఫూర్తి మాత్రం వికటకవి అని ప్రేమగా పిలుచుకొనే తెనాలి రామలింగడు అన్నారు. ఈ పరిశ్రమకు రాక ముందు, తరవాత ఆయనే నాకు ఆదర్శం. నా కలల్లోనూ, నిజ జీవితంలోనూ ఆయనే నా హీరో అన్నారు. ధట్స్ తెలుగు కీరవాణి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











