Don't Miss!
- Finance
LIC: అదానీ కంపెనీల్లో పెట్టుబడిపై ఎల్ఐసీ క్లారిటీ.. మెుత్తం ఎక్స్పోజర్ రూ.56,142 కోట్లు..!!
- Sports
INDvsNZ : మూడో టీ20కి మంచి పిచ్ కావాలి.. టాపార్డర్‌కు అదొక్కటే దారి!
- News
పాకిస్తాన్లో నరమేథం: మసీదులో ప్రార్థనల వేళ: అంతకంతకూ మృతుల సంఖ్య..!!
- Lifestyle
జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చదువుకునే రోజుల్లో అలా చెప్పేదాన్ని..: 'సూర్య'పై కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్..
వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది కీర్తి సురేష్. ఏరి కోరి మరీ మహానటి లాంటి సినిమా కీర్తిని వరించడం ఆమె కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. తనదైన అందం, అభినయంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ రాణిస్తున్న కీర్తి.. ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది..

'గ్యాంగ్'తో రెడీ:
కీర్తి సురేష్-సూర్య జోడీగా నటించిన 'తానా సేంద కూట్టం' ఈ సంక్రాంతి విడుదలకు సిద్దమైంది. తెలుగులో ఈ సినిమా 'గ్యాంగ్' టైటిల్ తో రానుంది. స్టూడియోగ్రీన్ బ్యానరుపై కేజీ జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు సిద్దమైన తరుణంలో.. సినిమాలో తన పాత్ర గురించి వివరించారు కీర్తి సురేష్.
Recommended Video


పేరు లేని పాత్ర:
సినిమాలో తాను బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో నటించినట్లు కీర్తి సురేష్ చెప్పారు. అయితే ఈ పాత్రకు సినిమాలో పేరే ఉండదన్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ చెప్పిన కథ నచ్చడంతోనే సినిమాకు కమిట్ అయినట్లు చెప్పారు.

చదువుకునే రోజుల్లో..:
'సూర్య తండ్రి శివకుమార్‌కు జోడీగా మా అమ్మ మూడు సినిమాల్లో నటించారు. చదువుకునేటప్పుడు ఏదో ఒకరోజు తప్పకుండా సూర్యతో కలసి ఓ సినిమాలో నటిస్తానని నా స్నేహితులకు చెప్పేదాన్ని. ఆ కల ఈ రోజు నిజం కావడం ఆనందంగా ఉంది.' అన్నారు కీర్తి సురేష్.

సూర్య సున్నితమైన వ్యక్తి:
ఆన్ స్క్రీన్ సూర్యకు, ఆఫ్ స్క్రీన్ సూర్యకు చాలా తేడా ఉందంటోంది కీర్తి. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి అని, ఎక్కువగా మాట్లాడరని చెబుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హాస్య నటుడు సెంథిల్‌తో నటించడం మరచిపోలేని అనుభవం అన్నారు.

ఫ్యామిలీ ట్రిప్ లాగా..:
సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఒక ఫ్యామిలీ ట్రిప్ లా అనిపించిందన్నారు. అమ్మకు మంచి స్నేహితురాలైన రమ్యకృష్ణతో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సినిమాపై మంచి అంచనాలు..:
తెలుగులో గ్యాంగ్ టైటిల్ తో రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ చాలామందిని ఆకట్టుకుంది. 'పోలిసంటే రొటీన్ కదా సర్, ఈ సారి కొత్త ట్రాక్' అని టీజర్ లో సూర్య చెప్పిన డైలాగ్ బాగానే పేలింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఇక వేచి చూడాలి.