కీర్తి సురేష్ బ్యాడ్ లక్.. మరో సినిమా కూడా ఓటీటీలోనే..
మహానటి లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా భారీగా క్రేజ్ అందుకుంది. ఆ ఒక్క సినిమాలో ఆమె మహానటి సావిత్రిని గుర్తు చేయడంతో అగ్ర హీరోలు కూడా ఫిదా అయ్యారు. ఇక మహానటి హిట్టవ్వడంతో కీర్తి సురేష్ డైరీ ఒక నెలలోనే ఫుల్ అయ్యింది. రెండేళ్ల వరకు సరిపడే సినిమాలను సెట్ చేసుకుంది.
ఒవైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో హిట్స్ కొట్టాలని ప్లాన్ గట్టిగానే వేసింది. కానీ ఆమె చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. దానికి తోడు కరోనా లాక్ డౌన్ కూడా దెబ్బ కొట్టింది. ఇప్పటికే రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా ఇప్పుడు మరొక సినిమా కూడా ఓటీటీలోకి రాబోతోంది.

మొదట లాక్ డౌన్ లో అమెజాన్ ప్రైమ్ లో పెంగ్విన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ తరువాత మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఆ రెండు సినిమాలు ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. రిలీజ్ అయినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. త్వరలోనే జీ5 లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. నాగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యమైన పాత్రలో నటించారు. మరి ఈ సినిమాతో అయినా మహానటి కీర్తి పాజిటివ్ టాక్ ను అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











