»   »  సావిత్రి కోసం ప్రోస్తటిక్ మేకప్..?? కీర్తి అసలు బరువే పెరగ లేదు, అసలు ఏం చేస్తున్నారో

సావిత్రి కోసం ప్రోస్తటిక్ మేకప్..?? కీర్తి అసలు బరువే పెరగ లేదు, అసలు ఏం చేస్తున్నారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో సూర్యకు జంటగా "తానా సేర్నద కూటం" చిత్రంలో నటిస్తున్న కీర్తి ద్విభాషా చిత్రం మహానటిలోనూ నటిస్తోంది. ఇది మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందుతున్న చిత్రం అన్నది తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. ఇందులో సావిత్రి గారి పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్ మీద చాలానే అనుమానాలు వచ్చాయి.., బరువు పెరుగుతోందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె బరువు పెరగటం లేదట, మరి సావిత్రి లుక్ ఎలా వస్తుందీ అంటే ఇలా సమాధానం చెప్పింది.

ఇంకాస్త బొద్దుగా ఉండాలి

ఇంకాస్త బొద్దుగా ఉండాలి

సావిత్రి మాదిరి గెటప్‌ వేయించి కీర్తిసురేష్‌తో చిత్రీకరణ మొదలెట్టారు. అయితే ఈ గెటప్‌ చిత్రాలు లీక్‌ అయి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆ ఫొటోల్లో కీర్తీ సురేష్ ని చూసిన వాళ్ళంతా. అయ్యో..! సావిత్రి గారిలాగా లేదే ఇంకాస్త బొద్దుగా ఉండాలి కదా అంటూ అభ్యంతరాలు లేవదీసారు.సావిత్రి బొద్దుగానే ఉంది

సావిత్రి బొద్దుగానే ఉంది

సావిత్రి తనకెరీర్ లో మొదటి కొన్ని ఏళ్ళు తప్ప మిగిలిన మొత్తం బొద్దుగానే ఉంది. అదే ఆమె అందం కూడా. గుండమ్మ కథ, మాయాబజార్ సినిమాల్లో కూడా సావిత్రి కొంచెం బొద్దుగానే ఉంటుంది. సో సహజంగా ఉండాలి అంటే కీర్తి సురేష్ కొంచెం లావుగా ఉండాలి కాబట్టి కీర్తి కూడా బరువు పెరుగుతోంది అంటూ చెప్పుకున్నారు.కీర్తి కూడా బరువు పెరుగుతోంది

కీర్తి కూడా బరువు పెరుగుతోంది

ఈ మూవీలో సావిత్రి పాత్ర కోసం ఆమె బ‌రువు పెరింగ‌ద‌నే వార్తలు కూడా వ‌చ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనేది కీర్తి సురేశ్ సన్నిహితుల కొట్టిపారేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె కాస్త బరువు తగ్గిందని చెబుతున్నారు. అసలు కీర్తి సురేశ్ బరువు పెరిగిందా .. తగ్గిందా? అనే విషయంలో ఎవ‌రికి క్లారిటీ లేదు.క్లారిటీ ఇచ్చేసింది

క్లారిటీ ఇచ్చేసింది

ఇప్పుడు వీటిపై ఈ భామ ఫుల్లు క్లారిటీ ఇచ్చేసింది. సావిత్రి పాత్ర కోసం బరువు పెరగడం అనే పాయింట్ పై ఓపెన్ గానే చెప్పేసింది కీర్తి సురేష్. 'నిజంగా చెప్పాలంటే.. నేను ఈ పాత్ర కోసం బరువు పెరగడం లేదు. ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా నేను వెయిట్ తగ్గించుకుంటున్నాను కూడా. అయితే.. సావిత్రి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. ప్రోస్థటిక్ మేకప్ ను ఉపయోగిస్తున్నాం. అలాగ మేకప్ సహాయంతో నేను లావుగా కనిపిస్తున్నానంతే' అని చెప్పేసింది కీర్తి సురేష్.బరువు పెరగాల్సి ఉంటుందనే

బరువు పెరగాల్సి ఉంటుందనే

సావిత్రి పాత్ర కోసం బరువు పెరగాల్సి ఉంటుందనే.. పలువురు టాప్ హీరోయిన్లు ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదనే టాక్ కూడా ఉంది. ఇక కీర్తి ఇతర సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీలో లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ హీరో సూర్య నెక్ట్స్ మూవీలో కూడా నటిస్తోంది. వీటితో పాటు విక్రమ్ సినిమా సామి2.. విశాల్ మూవీ శాండాకోజీ(పందెంకోడి)2 లో కూడా నటించనుంది కీర్తి సురేష్.మెదడుని తొలిచేస్తుంది

మెదడుని తొలిచేస్తుంది

ఇదంతా ఓకే నే కానీ అందరికి ఒక డౌట్ మాత్రం మెదడుని తొలిచేస్తుంది. ఈ సినిమా కేవలం సావిత్రి వ్యక్తిగత జీవితం మీద ఉంటుందా లేక సినిమా లైఫ్ లో తాను పేస్ చేసిన అన్ని దశలను చూపుతుందా అని. దానికి సమాధానం అశ్విన్ దగ్గర మాత్రమే ఉంది. ఒకవేళ సినిమా లైఫ్ అయితే మాత్రం ఎన్టీఆర్, ఎఎన్ఆర్ పాత్రలను ఎవరు వేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫాన్స్. ఆమధ్య ఎస్వీ రంగా రావు గారి పాత్రను ప్రకాశ్ రాజ్ చేస్తున్నాడని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.
English summary
Keerthy Suresh covering with Prosthetic Makup to put on weight for Savitri biopic
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu