»   » అటు పవన్ తో చేస్తూనే ఇంకో క్రేజీ ఆఫర్: శర్వానంద్ తో కీర్తి సురేష్?

అటు పవన్ తో చేస్తూనే ఇంకో క్రేజీ ఆఫర్: శర్వానంద్ తో కీర్తి సురేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన ఈ బ్యూటీ, నాని సరసన నేనులోకల్ తో మరోసారి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళనాట కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రకాష్-శర్వా సినిమాలో కథానాయికగా చేయబోతోందట. ప్రకాష్ సినిమాలు ఆడకపోయినా.. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.

Keerthy Suresh in Sharwanand's movie ?

'అనగనగా ఓ ధీరుడు'లో శ్రుతి హాసన్ ను చాలా అందంగా చూపించి.. ఆమెపై ఇండస్ట్రీ జనాల దృష్టి పడేలా చేశాడు ప్రకాష్. ఇక 'సైజ్ జీరో'తో అనుష్కను కూడా సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. మరి కొత్త సినిమాలో కీర్తికి ఎలాంటి రోల్ ఇచ్చాడో.. ఆమెనెలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

English summary
Now reports suggest that Keerthy Suresh has been approached to play the lead actress in Sharwanand's new movie, which is going to be directed by K Raghavendra Rao's son Prakash Kovelamudi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu