»   » నటి అశ్లీల వీడియోలు ఇలా ఆ హీరో చేతికి వచ్చాయి: లాయర్, పొలిటీషియన్ల హస్తమూ ఉంది.

నటి అశ్లీల వీడియోలు ఇలా ఆ హీరో చేతికి వచ్చాయి: లాయర్, పొలిటీషియన్ల హస్తమూ ఉంది.

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ నటిపై లైంగికదాడియత్నం, కిడ్నాప్ కేసులో సూపర్ స్టార్ దిలీప్‌, ప్రముఖ దర్శకుడు నాదిర్ షాను కేరళ పోలీసుల అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్‌ కేసులో దిలీప్‌ నిందితుడిగా ఉన్నారు.

లైంగికంగా వేధించారు

లైంగికంగా వేధించారు

ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ తర్వాత

స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ తర్వాత

మలయాళ సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్ తర్వాత ఈ కేసుకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిలీప్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య కావ్య మాధవన్ మెడ చుట్టు ఈ కేసు బిగిస్తున్నట్టు కనిపిస్తున్నది.నటిని కారులో కిడ్నాప్ చేసి ఆపై అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసిన తర్వాత అసలు ఆవీడియోలు హీరో దిలీప్ చేతికి ఎలా వచ్చాయన్న విషయం వింటే బుర్ర తిరిగిపోక మానదు.

లాయర్లూ, పొలిటీషియన్లూ

లాయర్లూ, పొలిటీషియన్లూ

లాయర్లూ, పొలిటీషియన్లూ ఇందులో ఇరుక్కోనున్నారు. ప్రధాన నిందితుడు పల్సర్ నునీ చెప్పిన దాన్ని బట్టీ ఆరోజు ఆమె వీడియోలు తీసిన తర్వాత మొదట ఆ డాటాను లాయర్ ప్రతీక్ ఛకోవ్ కు పంపించాడని విచారణలో వెల్లడైంది. ఎస్పీ ఏవీ జార్జ్‌ మాత్రం విచారణకు సంబంధించిన కీలక వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

లాయర్ ఛకోవ్

లాయర్ ఛకోవ్

ప్రస్తుతం పరారీలో ఉన్న లాయర్ ఛకోవ్ నుంచి ఆ వీడియోలు, ఫొటోలు ఓ వీఐపీ చేతికి అందినట్లు సమాచారం. ఆ వీఐపీ నేరుగా నటుడు దిలీప్ నకు నటిపై వేధింపులు జరిపిన తతంగానికి సంబంధించిన డాటాను ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. లాయర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకొస్తాయని, కేసు త్వరగా కొలిక్కి వస్తుందని కేరళ పోలీసులు భావిస్తున్నారు.

ఇంకా అదుపులోకి తీసుకోలేదు

ఇంకా అదుపులోకి తీసుకోలేదు

అయితే కేసు విషయమై ఫోన్ లో నిజంగానే డాటా ఉందని సమాచారం ఇచ్చి, విచారణకు సహకరించాడన్న కారణంతో ఆయనను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. మరోవైపు ఈ కేసులో ప్రధాన హస్తం ఉన్న నటుడు దిలీప్ ను ఈ నెల 10న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దిలీప్‌ ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా అంగమాలి సబ్‌ జైలులో ఉన్నారు.

English summary
Kerala Actress Abuse video Handover to malayalam Star hero Dileep in This way
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu