»   » సినీ నటి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?

సినీ నటి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ నటి లైంగిక వేధింపుల కేసు థ్రిల్లర్ సినిమాను మించి అనేక మలుపులు తిరుగుతున్నది. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్ తర్వాత ఈ కేసుకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిలీప్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య కావ్య మాధవన్ మెడ చుట్టు ఈ కేసు బిగిస్తున్నట్టు కనిపిస్తున్నది. దిలీప్ అరెస్ట్ తర్వాత లైంగిక దాడికి గురైన మలయాళ నటి మీడియాతో మాట్లాడారు. అనేక సంచలన విషయాలను వెల్లడించారు.

ఆరోపణల్లో వాస్తవం లేదు..

ఆరోపణల్లో వాస్తవం లేదు..

దిలీప్‌తో నాకు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఉన్నాయనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఆయనతో నాకు ఆర్థిక పరమైన సంబంధాలు అసలే లేవు. కొంతకాలంగా దిలీప్‌ నాతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో ఉన్నవి కేవలం వ్యక్తిగతమైన సమస్యలే అని సినీ నటి వెల్లడించడం సంచలనం రేపింది.

కస్టడీలో అనేక విషయాలు

కస్టడీలో అనేక విషయాలు

తన మాజీ భార్యకు ప్రస్తుతం భార్య కావ్య మాధవన్‌తో అఫైర్ విషయాలను వెల్లడించారనే కోపంతో లైంగిక దాడికి గురైన నటిపై ద్వేషం పెంచుకొన్నారనేది ఈ కేసు సారాంశం. ఆమెపై కక్ష పెంచుకొన దిలీప్ భారీ మొత్తంలో డబ్బు పల్సర్ సునీల్, మరికొందరికి డబ్బు ఎరవేసి కిడ్నాప్ చేయించారని, అంతేకాకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను కూడా తీయించడం జరిగిందనే ఆరోపణలకు సాక్ష్యం దొరకడంతో గత సోమవారం దిలీప్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ విచారణలో పలు విషయాలను దిలీప్ వెల్లడించినట్టు సమాచారం.

నటి కిడ్నాప్ వ్యవహారంలో కావ్య

నటి కిడ్నాప్ వ్యవహారంలో కావ్య

సినీ నటిపై లైంగిక దాడి వ్యవహారం అంతా ప్రస్తుత భార్య కావ్య మాధవన్‌ కనుసన్నల్లో జరిగాయనే ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో చర్చానీయాంశమయ్యాయి. కిడ్నాప్, లైంగికదాడి కేసులో కావ్య మాధవన్ పేరు కూడా వినిపించడంతో ఆమె చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నదనే మాట వినిపిస్తున్నది. నటిని లైంగికంగా వేధిస్తూ కారులో తీసిన వీడియోలు, ఫొటోలను పెన్ డ్రైవ్‌లో పెట్టి కావ్యకు అప్పగించినట్టు ప్రధాన నిందితుడు పల్సర్ సుని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాపార సంస్థలపై ఇటీవల పోలీసులు సోదాలు నిర్వహించారు.

కావ్య పాత్రపై విచారణ..

కావ్య పాత్రపై విచారణ..

ఇలాంటి ఆరోపణ నేపథ్యంలో దిలీప్ భార్య కావ్య, ఆమె తల్లి శ్యామల పాత్రపై కేరళ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే కావ్య, ఆమె తల్లి అరెస్ట్ తప్పదనే మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. దిలీప్ అరెస్ట్ నేపథ్యంలో వారి పాత్రపై నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి రావడం ఖాయం.

English summary
After Dileep arrest to linked with the Kerala actress abduction case, his wife Kavya Madhavan's name also cropped up. Kavya's home and place of business was raided by the police after prime accused Pulsar Suni reportedly told the police that he deposited a memory card with photos of the kidnapped actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu