twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళాభవవన్ మణిది హత్యా? ఆత్మహత్యా?..రంగంలోకి సీబీఐ!

    By Bojja Kumar
    |

    కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి మార్చి మొదటి వారంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం సహజంగా లేదని, అనేక అనుమానాలున్నాయని మొదటి నుండి పలు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనది ఆత్మహత్యా? హత్యా? అనేది తేల్చడంలో కేరళ రాష్ట్ర పోలీసులు విఫలం అయిన నేపథ్యంలో కేసు సిబీఐ చేతికి వెళ్లబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    అసలు కారణాన్ని పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు..
    ఈ కేసు సీబీఐకి అప్పగించడానికి కారణం పోలీసులు కేసును తేల్చడంలో విఫలం అవ్వడంతో పాటు... అసలు కారణాన్ని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇపుడు ఈ కేసు సీబీఐ చేతికి వెలుతుండటంతో ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు అసలు నిజం బయటకు వస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

    kalabhavan mani12

    ఫోరెన్సిక్ రిపోర్టులో అనుమానాలకు మరింత బలం...
    ఇటీవల విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్టుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్వహించిన టెస్టుల్లో ఇది రుజువైంది.

    రిపోర్టులు అమోమయం...
    ఇంతకు ముందు కొచ్చిలోని ప్రాంతీయ రసాయన పరీక్ష కేంద్రంలో జరిపిన టెస్టులో ఆయన శరీరంలో ప్రమాద కరమైన 'క్లోర్ పిరిఫోస్' అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చారు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన టెస్టులో మాత్రం ఆయన శరీరంలో పురుగు మందు అవశేషాలే ఏమీ లేవని తేలిపోయింది. అయితే ఒక్కో రిపోర్టు ఒక్కో రకంగా రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

    English summary
    Kerala government on Saturday decided to hand over to CBI the probe into the mysterious death of actor Kalabhavan Mani on March 6 this year.The decision in this regard was taken by the government within a week of the actor’s family meeting Chief Minister, Pinarayi Vijayan, seeking a CBI probe into Mani’s death, official sources said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X