కేరళ మ్యాన్ వీడియో వైరల్: శంకర్ మహదేవన్‌తో పని చేసే ఛాన్స్!
Recommended Video

ఇంటర్నెట్, సోషల్ మీడియా కొందరి పాలిట వరంలా మారుతోంది. టాలెంట్ ఉంటే సాధారణ వ్యక్తులను రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసేస్తోంది, ఊహించని అవకాశాలను తెచ్చి పెడుతోంది. కొన్ని రోజుల క్రితం సంజీవ్ శ్రీవాస్తవ అలియాస్ డాన్సింగ్ అంకుల్ ఇదే విధంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా కేరళకు చెందిన ఓ వ్యక్తి తాను పాడిన పాటతో ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ దృష్టిలో పడటమే కాదు... అతడి నుండి పిలుపు అందుకోవడం చర్చనీయాంశం అయింది.

ఇంటర్నెట్లో అతడు పాట పాడుతున్న వీడియో చూసి ఫిదా అయిపోయిన శంకర్ మహదేవన్...అతడి ఆచూకీ తెలుపాలంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ పోస్టుతో ఆ వ్యక్తి ఎవరు అని గాలించడం మొదలు పెట్టిన అభిమానులు... ఆ పాటగాడిని కూలి పని చేస్తూ జీవించే రాకేష్ ఉన్నిగా గుర్తించారు.
కేవలం శంకర్ మహదేవన్ నుండి మాత్రమే కాదు, సంగీత దర్శకుడు గోపీ సుందర్ నుండి కూడా రాకేష్ ఉన్నికి పిలుపు వచ్చింది. తను పాడిన పాటకు ఇంత గుర్తింపు రావడం, గొప్ప వ్యక్తుల నుండి పిలుపు రావడంపై రాకేష్ ఉన్ని ఆనందం వ్యక్తం చేశారు. వారు తనను అప్రిషియేట్ చేశారని, వాయిస్ చాలా బావుందని, అద్బుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పారని, శంకర్ మహదేవన్ లాంటి వ్యక్తులతో కలిసి పాడే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











