»   »  సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పాం: దిల్ రాజు

సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పాం: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలు సాధారణంగా ఆలస్యం కావు. కానీ ఆయన మొదలు పెట్టిన చిన్న బడ్జెట్ మూవీ ‘కేరింత' విషయంలో మాత్రం చాలా జాప్యం జరిగింది. నెల రోజుల షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రీషూట్లు కూడా చేసారు. తాజాగా జరిగిన కేరింత ఆడియో వేడుకలో దిల్ రాజు ఇందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ...కథపై ముందు నుండి ఏదో మిస్సవుతున్నామనే ఫీలింగ్. చివరకు 30 రోజుల షూటింగ్ తర్వాత కథలో మార్పులు చేద్దామని డిసైడ్ అయ్యాం. మార్పుల తర్వాత 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గతంలో ఇలాంటి కాన్సెప్టులు వచ్చాయి. ఆ సినిమాల్లో ఉండకూడదనే కథలో మార్పులు చేసాం. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అరుణ్ లను హీరోలుగా అనుకున్నాం. ఫోటో షూట్ కూడా చేసాం. కథకు సూటవ్వరని వాళ్లను పిలిచి సారీ చెప్పాం. తర్వాత సుమంత్ అశ్విన్, శ్రీదివ్యతో పాటు కొత్తవారిని ఎంచుకున్నామని తెలిపారు.


Kerintha Audio Launch

ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అలాంటి వారిలో స్క్రీన్ ప్లే రైటర్ హరి ఒకరు. సినిమాకు అతని స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. అనుకున్న విధంగా 60 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం. సాయి ఏదైతే అనుకున్నాడో ఆ అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అవుతుంది. ఈ సినిమాకు రామజోగ్య శాస్త్రి సింగిల్ కార్డు రాసారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సినిమా ఒకైటనా చేయాలని అనుకుంటున్నాను. ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇక మీదట కంటిన్యూగా సినిమాలను చేయాలని అనుకుంటున్నాను. మిక్కీజే మేయర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది అన్నారు.


'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి ఈ చిత్రం ద్వారా మరోసారి తన సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను అందిస్తున్నారు.

English summary
Kerintha Audio Launch event held at Rockheights, hyderabad.
Please Wait while comments are loading...