For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మి పార్వతి బజారుదానిలా మాట్లాడుతుంది: కేతిరెడ్డి సంచలనం

  By Bojja Kumar
  |
  లక్ష్మీ పార్వతి పై కేతిరెడ్డి సంచలన కామెంట్స్ ! | Filmibeat Telugu

  'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీ పార్వతి మీద సంచలన కామెంట్స్ చేశారు. అన్నగారు ఉన్నపుడు ఆమె మంచి వ్యక్తిలా నటించిందని, ఇపుడు నా వల్ల లక్ష్మీ పార్వతి నిజస్వరూపం ఏమిటో బయటపడుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో కేతిరెడ్డి ఈ సినిమా ద్వారా తాను ఏం చూపించబోతున్నానో వివరంగా వెల్లడించారు.

   అన్నగారు దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

  అన్నగారు దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

  జయం మూవీస్ పతాకంపై ‘లక్ష్మీస్ వీరగ్రంధం' అనే సినిమా నవంబర్ 12న రామారావుగారి సమాధి వద్ద మొదలు పెట్టాము. ఆ తర్వాత కూడా రెండ్రోజులు నిమ్మకూరు, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. రామారావుగారి జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతిగారి ప్రవేశం ఎలా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? సన్యాసి జీవితం కోరుకున్న అన్నగారు దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితులయ్యారు అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుంది. దీంతో పాటు కళాకారుడైన వీరగ్రంధం సుబ్బారావుగారి జీవిత చరిత్ర సినిమాలో ఉంటుంది... అని కేతిరెడ్డి తెలిపారు.

   అప్పట్లో సంచలన సినిమా చేశాను

  అప్పట్లో సంచలన సినిమా చేశాను

  గత 35 సంవత్సరాలుగా ఎన్నో సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. పద్మాలయ లాంటి సంస్థల్లో చేశాను. ఓ చిత్రానికి కూడా దర్శకత్వం చేశాను. నిర్మాతగా జయం, నిజం, సంబరం లాంటి సినిమాలు తేజతో పాటు భాగస్వామిగా ఉన్నాను. దర్శకుడిగా అప్పట్లో ‘అగ్ని' సినిమా చేశాను. ఇదే చిత్రం హిందీలో ‘కామ', కన్నడలో ‘కామాగ్ని' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం భారతదేశం మొత్తం సంచలనాత్మక సినిమాగా నిలిచింది. మీడియా ఇంత అడ్వాన్స్ స్టేజీలో లేని రోజుల్లో కూడా బిబిసి సంస్థలు ఈ సినిమా పట్ల ఆకర్షితులై ఇంటర్వ్యూలు చేశారు. ఆ సినిమా సెన్సార్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ సెన్సార్ పట్ల నాకున్న అవగాహన, సెన్సార్ మెంబర్ గా పని చేసిన అనుభవంతో సెన్సార్ ఎందుకు చేయరు అని పోరాటం చేసి సక్సెస్ అయ్యాను... అని కేతిరెడ్డి తెలిపారు.

   లక్ష్మీ పార్వతి ఒక బజారు వ్యక్తిలా మాట్లాడుతోంది

  లక్ష్మీ పార్వతి ఒక బజారు వ్యక్తిలా మాట్లాడుతోంది

  నేను సినిమా ప్రారంభించిన 12వ తేదీ తర్వాత లక్ష్మి పార్వతి 14వ తేదీన రామారావుగారి సమాధి వద్దకు వెళ్లి ఆ ప్రాంతం అపవిత్రం అయిందని పాలతో అభిషేకం చేశాను అని చెప్పారు. నాకు అన్నగారి పట్ల ఉన్న ప్రేమ, ఆయన ఆదేశంతో తీస్తున్న చిత్రం ఇది. వారిని నేను చాలా వరకు ఎంతో గౌరవంగా మాట్లాడటం జరుగుతోంది. కానీ ఆమె మాత్రం ఒక బజారు వ్యక్తిలాగా, ఒక రోడ్ సైడ్ మాట్లాడే వారిలా నన్ను బజారోడు, రౌడీ, వెధవ, నా అంతు చూస్తాను అని కామెంట్స్ చేసింది.... అని కేతిరెడ్డి తెలిపారు.

   ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఏమిటో

  ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఏమిటో

  ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఏమిటో ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నా వలన తెలిసింది. గతంలో ఆమె రామారావు గారి జీవితంలో ఉన్నపుడు చాలా సాఫ్ట్‌గా ఉన్నట్లు నటించింది. గతంలో ఆమె అన్నగారితో ఉన్నపుడు మాట, ప్రవర్తన ఏవిధంగా ఉంది? ఈ రోజు ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో తేడా గమనించవచ్చు... అని కేతిరెడ్డి తెలిపారు.

   నీ జీవిత చరిత్రను రాసుకుని ఎక్కడైనా రిజిస్టర్ చేశావా?

  నీ జీవిత చరిత్రను రాసుకుని ఎక్కడైనా రిజిస్టర్ చేశావా?

  నేను తీస్తున్న సినిమా అడ్డుకుంటాను అంటోంది. నువ్వు ఏ రకంగా అడ్డుకుంటావు? నీ జీవిత చరిత్రను రాసుకుని ఎక్కడైనా రిజిస్టర్ చేశావా? అదే జీవిత చరిత్రను నేను తీస్తుంటే నువ్వు నన్ను అడ్డుకోగలుగుతావు. కానీ అలాంటిదేమీ లేదు. నువ్వు నన్ను అడ్డుకునేందుకు లీగల్ గా కానీ, ఏ రకంగా కూడా అర్హత లేదు. లక్ష్మీస్ వీరగ్రంధం అనేది సినిమా పేరు. లక్ష్మీ అనే పేరు ఈ భారత దేశంలో కొన్ని కోట్ల మందికి ఉంటాయి. అదే విధంగా నీ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా కొన్ని కోట్ల మంది జీవితాల్లో ఉంటాయి.... అని కేతిరెడ్డి తెలిపారు.

   కొన్ని వేల ఉదాహరణలు నీకు ఇస్తాను.

  కొన్ని వేల ఉదాహరణలు నీకు ఇస్తాను.

  వయసు ఎక్కువైన వ్యక్తి జీవితంలో వారికి ఎలా చేదోడు వాదోడుగా ఉండి ధర్మపత్నిలైన కొన్ని వేల ఉదాహరణలు నీకు ఇస్తాను. కావాలంటే కోర్టుకు, సెన్సార్‌కు కూడా ఇస్తాను. నాకు దమ్ముంది, సినిమా తీస్తానంటే నువ్వెందుకు ఉలికిపడతావు. ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు లక్ష్మీపార్వతి గారు... అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

   నీ కథ మొత్తం తెలుసు

  నీ కథ మొత్తం తెలుసు

  మిమ్మల్ని అన్నగారి సతీమణిగా చాలా గౌరవిస్తున్నాం. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండగా... పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను రోడ్ సైడోన్ని అన్నారు. మీరు ఏ రాజమహల్ నుండి వచ్చారు? దానికి కూడా సమాధానం చెప్పాలి. నేను మీరు పుట్టిన ఊరుకు, మీరు మెట్టిన ఊరు వీరగ్రంధం సుబ్బారావుగారి ఊరికి వస్తాను. నీ జీవితం, నీ కథ అంతా నాకు తెలుసు.... అని కేతిరెడ్డి తెలిపారు.

  బెదిరిస్తానంటే బెదిరేవాళ్లం కాదు

  బెదిరిస్తానంటే బెదిరేవాళ్లం కాదు

  నువ్వు పోలీసులను పెట్టి బెదిరిస్తానంటే బెదిరేవాళ్లం కాదు. మేము ఉద్యమాల నుండి వచ్చిన వాళ్లము. మీరు మీకు సంబంధించిన మీడియా వారి ద్వారా నాపై అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. మద్రాసు నుండి అక్కడున్న తమిళ వారు నన్ను తరిమేశారని అంటున్నారు, నన్ను తరిమేసే దమ్ము, ధైర్యం వారికి లేదు. వాళ్లపైన ప్రత్యక్ష్యంగా పోరాటం చేసే వ్యక్తిని నేను. అంత దమ్మున్న తమిళోడు ఇప్పటి వరకు లేడు... అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

   వడివేలు ఇంటికెళ్ల కొట్టా...

  వడివేలు ఇంటికెళ్ల కొట్టా...

  వడివేలును ఇంటికి వెళ్లి కొట్టినా ఏం చేయలేక పోయాడు. తెలుగు బాష కోసం జయలలితను ఎదురించాను. జయలలిత మీద తమిళ పేపర్లలో స్టేట్మెంట్స్ ఇచ్చాను. నేను తాటాకు చప్పుళ్లకు భయపడను. ప్రజా స్వామ్యంలో ఒక లక్ష్యం కోసం పని చేసే వ్యక్తినే కానీ, వ్యక్తులు నన్ను బెదిరిస్తానంటే బెదిరే వ్యక్తిని కాదు. దమ్మున్న నాయకుడిని నేను. ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నీతో ఏం మాట్లాడటానికైనా సిద్ధంగా ఉంటాను.... అని కేతిరెడ్డి తెలిపారు.

   దమ్మున్నోడు ఎవరైనా ఉంటే రండి, తేల్చుకుందాం..

  దమ్మున్నోడు ఎవరైనా ఉంటే రండి, తేల్చుకుందాం..

  నువ్వు నన్ను మాట్లాడిన మాటలకు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా అన్నగారి ధర్మపత్నిగా ఉన్నావు కాబట్టే, అన్నగారిపై ఉన్న ప్రేమ వల్ల నేను అక్కడికి వరకు రాలేక పోతున్నాను. మీరు మాత్రం నాపై మీకు సంబంధించిన మీడియాలో నన్ను తమిళనాడు నుండి తరిమేసినట్లు రాయించారు. ఇపుడు నేను తమిళనాడులోనే ఉన్నా... ఎలక్షన్ జరుగుతున్న ఆర్కే నగర్ ప్రాంతంలో ఉన్నా. ఇక్కడ దమ్మున్నోడు ఎవరైనా ఉంటే రండి, తేల్చుకుందాం... అంటూ కేతిరెడ్డి సవాల్ చేశారు.

  English summary
  Lakshmi's Veeragrandham director Kethireddy Jagadishwar Reddy lambasted NTR's wife Lakshmi Parvathi on her recent comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X