నిర్మాతకి షాక్ ఇచ్చిన జగపతి బాబు
జగపతి బాబుకి హిట్టు వచ్చి ఎంత కాలం అయింది అంటే తేల్చి చెప్పటానకి చాలా టైమ్ పడుతుంది. అయితే అతను రెమ్యునేషన్ ని మాత్రం తగ్గించకుండా తనని కలిసే చిన్నా చితకా నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు. తాజాగా కీ అనే చిత్రంలో స్పెషల్ అప్పీరియన్స్ కోసం జగపతి బాబుని తీసుకుంటే డబ్బై లక్షలు డిమాండ్ చేసాడు.అలాగే నగరం నిద్రపోతున్న వేళ చిత్రానకి అంతే డిమాండ్ చేసి తీసుకున్నాడు.
ఆ చిత్రం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోవటంతో ఆ నిర్మాత గొల్లుమన్నాడు. ఇక ఇప్పుడు కీ వంతు వచ్చింది. కీ నిర్మాతలు అతను అంత డిమాండ్ చేస్తాడని ఊహించలేదు.కొద్ది రోజులు షూటింగ్ కి చాలా తక్కువ అడుగుతాడనుకున్నారు. ఎందుకంటే సినిమా మొత్తానికి డబ్బై లక్షలుతీసుకున్న వాడు తమకీ అంతే ఎమౌంట్ ఛార్జ్ చేస్తాడనుకోలేదు.కానీ డైరక్టర్ పట్టుబట్టడంతో జగపతినే తీసుకోక తప్పలేదు. అయితే తమ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తాననటంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. పది ప్రింట్లతో త్వరలో ఈ చిత్రం విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











