Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF 2 టీజర్ లీక్.. క్లారిటి ఇచ్చిన హీరో యష్.. అసలు కారణం ఇదే!
కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినీ అభిమానులు KGF 2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలైతే ఈపాటికే సినిమా వస్తుందని అనుకుంటే కరోనా ఎఫెక్ట్ పడింది. ఫైనల్ గా ఏడాదిపాటు వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు సినిమా టీజర్ ఒక్కసారిగా అంచనాల డోస్ ను పెంచేసింది. అయితే సినిమా టీజర్ లీక్ అవ్వడంపై యష్ స్పందించాడు. ఇక లీక్ అవ్వడానికి గల కారణం కూడా బయటకు వచ్చింది.

ముందురోజే టీజర్ లీక్
యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10:18నిమిషాలకు KGF 2 టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకరోజు ముందే టీజర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అభిమానులను షాక్ కు గురి చేసింది. ముందుగా కన్నడలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగు హిందీ భాషల్లో విడుదల చేస్తారని మొదట ఊహాగానాలు వచ్చాయి.

ఉదయం వరకు ఎవరికి అర్థం కాలేదు
టీజర్ ఎలా లీక్ అయ్యిందనే విషయం ఉదయం వరకు ఎవరికి అర్థం కాలేదట. ఇక చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ టెక్నీషియన్స్ ను ప్రతి ఒక్కరినీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక యష్ కూడా టీజర్ బయటకు వచ్చిన కొద్దిసేపటికే అభిమానులకు ఒక వివరణ ఇచ్చారు. టీజర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నట్లు చెబుతూ జరిగిందేదో జరిగిపోయిందని అన్నాడు.

యష్ మాట్లాడుతూ..
నా పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నాము. కానీ ఎవరో మహానుభావులు ముందే లీక్ చేశారు. అలా చేసినందుకు వారికి ఏం వచ్చిందో నాకైతే తెలియదు. ఇక జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అఫీషియల్ గా టీజర్ ను హోంబలే యూ ట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నాడు.

టీజర్ ఎలా లీక్ అయ్యిందంటే..?
ఏదైనా లీక్ అయితే ముందుగా ఎడిటింగ్ టీమ్ పైనే ఫోకస్ పడుతుంది. ఇక టీజర్ అక్కడి నుంచే బయటకు వచ్చి ఉండవచ్చని దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట ఎడిటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ ను ఆరా తీశారని అందులో ఒక యువకుడి ద్వారానే టీజర్ లీక్ అయినట్లు కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

యష్ యాక్షన్ లుక్
ఇక సినిమా టీజర్ ను చూస్తే ఆల్ ఇన్ వన్ మాదిరిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో టీజర్ ను వదిలారు. వేడిమీద ఉన్న గన్నుపై సిగరెట్ కాల్చుతూ యష్ పవర్ఫుల్ లుక్ లో దర్శనమిచ్చాడు. లీకైనప్పుడే టీజర్ ఆ అంచనాల డోస్ ను మరింత పెంచేసింది. మదర్ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.