»   » ఖైదీ నెం 150: లారెన్స్ వచ్చాడు, చిరుతో అదిరే స్టెప్స్ వేయిస్తున్నాడు (ఫోటోస్)

ఖైదీ నెం 150: లారెన్స్ వచ్చాడు, చిరుతో అదిరే స్టెప్స్ వేయిస్తున్నాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా రంగానికి సంబంధించి ట్రెండ్ సెట్టర్ గా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ చిరంజీవి. ఆయన తెలుగు సినిమా రంగంలో నెం.1 స్టార్, మెగా స్టార్‌గా ఎదగడానికి ప్రధాన కారణం... ఆయన సినిమాల్లో యాక్షన్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలకు ఎక్కువ ప్రధాన్యం ఉండటమే.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

ఒక ప్పుడు చిరంజీవి సినిమా విడుదలైందంటే.... కేవలం ఆయన చేసే డాన్సులు, ఫైట్లు చూసేందుకు కొంత మంది ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లే వారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

150వ సినిమాలో

150వ సినిమాలో

ప్రస్తుతం చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెం. 150' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం అభిమానులను ఎంటర్టెన్ చేయడమే. అందుకే ఎలాంటి ప్రయోగాలకు పోకుండా, బోర్ కొట్టించే సందేశాలు ఇవ్వకుండా కమర్సియల్ అంశాలపైనే దృష్టి పెట్టారు.

లారెన్స్

లారెన్స్

ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే డాన్స్ తో అభిమానులను అలరించబోతున్నాడు. మెగాస్టార్ తో దిరిపోయే స్టెప్స్ వేయించడానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ లారెన్స్ రంగంలోకి దిగారు.

చిరు-లారెన్స్

చిరు-లారెన్స్

చిరంజీవి కోసం లారెన్స్ డాన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇక ఇంద్ర మూవీలో దాయి దాయి దామా కులికే కుంద‌నాల కొమ్మ‌.. సాంగ్‌లో వీణ స్టెప్ ఎవర్‌గ్రీన్.

అన్నపూర్ణ స్టూడియోలో

అన్నపూర్ణ స్టూడియోలో

హైద‌రాబాద్ -అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి - ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు.

కేక పెట్టించే సాంగ్

కేక పెట్టించే సాంగ్

ఈ స్పెషల్ సాంగుకు దేవీశ్రీ లిరిక్ అందించ‌డంతో పాటు అభిమానులను ఊర్రూతలూగించేలా అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. సాంగ్ ట్యూన్ అదిరిపోయేలా ఉండటంతో లారెన్స్ కూడా అదిరిపోయే రేంజిలో డాన్సింగ్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు.

English summary
Mega Star Chiranjeevi is busy with his on-going film 'Khaidi No. 150' and currently he is in dancing mood. He is ready to shake his legs with Lakshmi Rai in a huge set at Annapurna Studios. Popular dance master, Raghava Lawrence will be composing electrifying steps for this energetic tune composed by Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu