»   »  చిరంజీవి నిర్ణయంతో దాసరి ఆనందం, అసలేం జరిగింది?

చిరంజీవి నిర్ణయంతో దాసరి ఆనందం, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు అంటే దర్శక రత్న దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి పేర్లు చెబుతుంటారు చాలా మంది. అయితే ఈ ఇద్దరు తమ తమ గ్రూఫులు మెయింటేన్ చేస్తున్నారని.... ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని చాలా కాలంగా ఓ ప్రచారం కూడా ఉంది.

ఏదైనా మీటింగులో దాసరి ఏదైనా మాట్లాడితే... అది చిరంజీవిని, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అంటూ ప్రచారం మొదలవ్వడం ఈ మధ్య సర్వసాధారణం అయింది. ఆ మధ్య రామ్ చరణ్ ఏదో అంటే... అది దాసరిని ఉద్దేశించి చేసిన కామెంట్సే అంటూ అప్పట్లో పెద్ద రచ్చ అయింది.

అయితే వాస్తవానికి ఇలాంటి ఏమీ లేవని, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది వారి వారి సన్నిహితుల చెప్పేమాట. ఖైదీ నెం 150 ఆడియో వేడుకకు దాసరి ముఖ్య అతిథిగా హాజరు కావడమే ఇందుకు నిదర్శనం.

దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు హర్షిస్తున్నాయి.

 అది దాసరి విల్ పవర్

అది దాసరి విల్ పవర్

పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా మడమ తిప్పకుండా పోరాటం చేసే వ్యక్తి దాసరి. ఆస్పత్రిలో చేరినా కూడా ఆయన విల్‌పవర్‌తో అనారోగ్యంతో ఫైట్‌ చేసి విజయం సాధించారు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో తమ కాన్ఫిడెన్స్ కోల్పోయి బేలగా మారతారు. కానీ దాసరిగారి కాన్ఫిడెన్సే ఆయన్ని బతికించింది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ చెప్పుకొచ్చారు.

 చిరంజీవి తీసుకున్న నిర్ణయం సూపర్

చిరంజీవి తీసుకున్న నిర్ణయం సూపర్

వాస్తవానికి ఇప్పటికే ‘ఖైదీనెంబర్‌ 150' విజయోత్సవ వేడుక నిర్వహించాల్సి ఉంది. అయితే దాసరి లాంటి వ్యక్తి అనారోగ్యంతో అలా ఆసుపత్రిలో ఉండటం వల్లే ఈ సినిమా సక్సెస్ మీట్ ను వాయిదా వేసారట. మీరు ఆడియో ఫంక్షన్‌కి వచ్చి మాకు ఎంతో స్పూర్తినిచ్చారు. అలాగే ఖైదీ నెం 150 సక్సెస్ వేడుకకు వస్తే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నదీ అందరికీ అర్థమవుతుంది అని ఇటీవల దాసరిని కలసిన చిరంజీవి అన్నారట.

 దాసరి హ్యాపీ

దాసరి హ్యాపీ

చిరంజీవి ఈ మాట చెప్పగానే దాసరిగారి కళ్లలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ ఆనందంతో ఆయన లేచి నడిచేస్తారేమో అన్నంత కాన్ఫిడెన్స్ ఆయన కళ్లలో కనిపించింది... అని దర్శకుడు వివి వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 దాసరి నారాయణరావు

దాసరి నారాయణరావు

దర్శక రత్న దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అన్నవాహిక ఇన్ స్పెక్షన్ రావడంతో వైద్యులు చికిత్స నిర్వహించారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.

English summary
Megastar Chiranjeevi met director Dasari Narayan Rao at KIMS Hospital and the latter promised to attend the meet. So now the Konidela unit has decided to postpone the meet until the director recovers fully and is able to attend the function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu