»   » ‘నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌"... 150 టీజర్

‘నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌"... 150 టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్న మెగాఫ్యాన్స్, టాలీవుడ్ జనాలకు ఆ సమయం రానే వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే కొణిదెల ప్రొడక్షన్స్‌వారు 'ఖైదీ నెంబర్ 150'కి సంబంధించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. తమ అభిమాన నటుడి రీఎంట్రీకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఖైదీ టీజర్ ఉత్తేజాన్నిచ్చేలా ఉంది. 61ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడేలా నటన.. స్టెప్స్..వేసి ఆశ్చర్యపడేలా చేశాడు మెగాస్టార్.

టీజర్ అదిరిపోయింది. చిరు రీ-ఎంట్రీ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఊహించలేరు. టీజర్ లోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు చిరు. 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌' అంటూ చిరు చెప్పిన డైలాగ్‌ బాగా పేలింది. టీజర్ తో మెగా ఖైదీపై అంచనాలు ఆకాన్ని దాటివెళ్లడం ఖాయం. ఖైదీ నెం.150 అని రామ్‌చరణ్ ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.

Khaidi No 150 teaser released

మెగా అభిమానులని అలరించే అన్ని అంశాలు మెగా ఖైదీలో ఉంటాయని ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పుడు టీజర్ చూస్తే.. అది పక్కా అని తెలుస్తోంది. యాక్షన్, డైలాగ్ కలిపి టీజర్ ని సూపర్భ్ గా డిజైన్ చేశారు. ఇది షాంపిల్ మాత్రమే.. సినిమాలో ఇలాంటివి చాలా ఉన్నాయంటోంది చిత్రబృందం. ఇప్పటికైతే మెగా అభిమానులు టీజర్ తో పండగ చేసుకొంటున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరు చేస్తున్న చిత్రం కాబట్టి.. ఇందులో చిరు ప్రతి ఫ్రేమ్‌లో హైలైట్ చేస్తూ చూపించారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో.. చిరు సరికొత్త గెటప్‌లో చాలా యంగ్‌గా, అచ్చం ఖైదీలా ప్రవర్తిస్తూ కనిపించాడు. చిరు సినిమా రిలీజ్ అయితే ఎలాఉండబోతోందో, ఎంతటి సునామీ సృష్టించబోతోందో ఇప్పుడే తెలిసిపోతోంది.60 ఏళ్ల వయస్సులోనూ అందరికీ ఈర్ష కలిగేలా స్టైలిష్‌గా కనువిందు చేశాడు చిరు.

English summary
The teaser of Khaidi No 150, starring megastar Chiranjeevi and Kajal Aggarwal, was released on YouTube at 6.00 pm on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu