»   » ఖైదీ 150 బుల్లితెర టీఆర్పీ వెనక చేదు నిజాలు: మెగాస్టార్ స్టామినా తగ్గుతోందా

ఖైదీ 150 బుల్లితెర టీఆర్పీ వెనక చేదు నిజాలు: మెగాస్టార్ స్టామినా తగ్గుతోందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సార్లు నిజమే అయినా నమ్మ బుద్ది కాదు మనం బలంగా కోరుకున్నది జరుగుతూంటే కూడా దాన్ని ఒప్పుకోవటానికి మనస్సంగీకరించదు.., కానీ తఒప్పదు అది నిజం కదా.. అలాంటిదే చిరు 150 బుల్లితెర టీఆర్పీ రికార్డులు తిరగ రాసిందనీ, అసలు ఆరోజు సినిమా చూడని తెలుగు ఇల్లే లేదనీ చెప్పుకుని సంబరాలు చేసుకున్నారు. వెండితెరమీద ఉన్న క్రేజ్ ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తుందని నమ్మారు కానీ ఫలితం బయటకి వచ్చాక చూస్తే అంతా షాక్.. అప్పుడు అభిమానులు పెట్టిన పోస్ట్ ఒక సారి చూడండి, తర్వాత అసలు నిజాన్నీ చూడండి...

ఐఫా ఉత్సవాలను ప్రసారం చేశారు

ఐఫా ఉత్సవాలను ప్రసారం చేశారు

"టివి రేటింగ్స్ భారీగా ఉండే ఒకానొక ఆదివారం. ఒక ఛానల్ వారు ఐఫా ఉత్సవాలను ప్రసారం చేశారు. ఎన్టీఆర్, రానా, నానీ, వెంకటేష్, నాగార్జున‌లాంటి ఎంతో మంది హీరోలు, సమంతాతో సహా బోలెడుమంది హీరోయిన్స్....అలాగే పాటలు, జోకుల హంగామా....మొత్తంగా ఒక పండగలాంటి ఐఫా అవార్డ్స్ వేడుకని చూడడం కంటే కూడా పక్క ఛానల్‌లో ప్రసారమైన ఖైదీనంబర్ 150ని చూడడానికే ఇష్టపడ్డారు ప్రేక్షకులు.


పదేళ్ళ గ్యాప్ తర్వాత

పదేళ్ళ గ్యాప్ తర్వాత

ఐఫా ఉత్సవాలు ప్రసారం చేస్తున్న ఛానల్‌కి పోటీగా ఇంకో ఛానల్ పదేళ్ళ గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాను ప్రసారం చేసింది. ఐఫా ఉత్సవాల సంరంభాన్ని తట్టుకోగలమా అని ఆలోచించిన ఆ ఛానల్ వారికే షాక్ ఇస్తూ ఖైదీ నంబర్ 150 టాప్ రేంజ్ టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. చిరు గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని, తెలుగు సినిమా లవర్స్ ఇప్పటికీ కూడా చిరునే ఎక్కువ ఆదరిస్తున్నారని నిరూపించింది.


మెగాస్టార్ మెగాస్టారే

మెగాస్టార్ మెగాస్టారే

ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎంతైనా మెగాస్టార్ మెగాస్టారే అని చర్చించుకుంటున్నారు. అంటూ ఫేస్ బుక్ ఫ్యాన్స్ పేజ్ లు హోరెత్తి పోయాయి." ఇదీ ఆ ఫ్యాన్స్ పేజ్ లో ఉన్న కథనం. కానీ వారు కోరుకున్నట్టు జరగలేదు మెగాస్టార్ సినిమాను బుల్లితెరమీద పెద్దగా పట్టించుకోలేదు, థియేటర్ల వద్ద పడిగాపులుకాసీ, బలాక్ లో కొనీ ఆన్లైన్ లో వెతికీ వెతికీ టిఒకెత్లు బుక్ చేసుకొని సినిమా చూసిన ప్రేక్షకులు టీవీ లో మాత్రం పెద్దగా ఖైదీ ని పట్టించుకోలేదు.


తీవ్ర నిరాశ లో ముంచేసింది

తీవ్ర నిరాశ లో ముంచేసింది

అసలు ఖైదీ నెం 150 ఒక ప్రభంజనం సృష్టించేసిందీ అన్న రేంజ్ లో సంబరాలు చేసుకున్నారు గానీ పాపం ఇప్పుడు వచ్చిన నిజం వారిని తీవ్ర నిరాశ లో ముంచేసింది... చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150' సిల్వర్ స్క్రీన్‌పై ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.


 మీలో ఎవరు కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు

అయితే బుల్లితెరపై మాత్రం ఇది చేదు అనుభవాన్నే మిగిల్చింది. రీసెంట్‌గా బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమా... లేటెస్ట్ రేటింగ్స్ ప్రకారం 6.9 రేటింగ్ రాబట్టింది. అసలే చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు రేటింగ్స్ రావటం లేదని అభిమానులు అందోళన పడుతుంటే.. తాజా రేటింగ్స్‌తో 'ఖైదీ నంబర్ 150' సినిమా మరింత నిరాశ పరచింది.
బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "బ్రహ్మోత్సవం" సినిమా కేవలం 7.52 రేటింగ్స్ ను అందుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా తీవ్రంగా నిరాశ పరచడంతో, అదే స్థాయిలో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చారని విశ్లేషణలు చేసారు.


విఫలమైంది

విఫలమైంది

అయితే చిరు సినిమా మంచి వసూళ్ళనే రాబట్టింది గానీ, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంలో విఫలమైంది. చిరు సినిమా కంటే నాగ్ ‘ఓం నమో వేంకటేశాయ' (9.81), నాని ‘నేను లోకల్' (9.28) ఉత్తమమైన రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.


అట్టడుగున బాలకృష్ణ

అట్టడుగున బాలకృష్ణ

అయితే అట్టడుగున బాలకృష్ణ "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా 5.52 రేటింగ్స్ లో ఉన్నప్పటికీ, సహజంగా బాలయ్య సినిమాలకు బుల్లితెర ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో అంత తక్కువ నమోదైనప్పటికీ ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు.


దారుణమైన పరాజయంగా భావించవచ్చు

దారుణమైన పరాజయంగా భావించవచ్చు

కానీ చిరుకున్న ఫాలోయింగ్ కు, అభిమాన ప్రేక్షకుల స్థాయికి 6.93 అంటే... అది అతి దారుణమైన పరాజయంగా భావించవచ్చు. అంతే... ప్రేక్షకులు ఎప్పుడు ఎవరికి ఎలాంటి తీర్పును అందిస్తారో... ఎలాంటి షాక్ ఇస్తారో... ఎవరికీ తెలియదు.అక్కడ అంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులు రెండోసారి ఇంట్లో మాత్రం సినిమాని పట్టించుకోనే లేదుEnglish summary
The movie had its first world TV premier on 28th May and according to the latest update, the TRP of Khaidi No 150 on that day is 6.9 and the industry people are shocked after hearing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu