twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి ‘ఖైదీ’ రీమేక్ ఖరారు... చరణ్‌ హీరో?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'ఖైదీ'.. ఈ సినిమా పేరు వినని, చూడని తెలుగు సినీ ప్రేక్షకులు వుండరు. అక్టోబర్28, 1983 విడుదలైన ఈ సినిమా అప్పటికి, ఇప్పటికీ ఓ సంచలనం. చిరంజీవిని ఓ సుప్రీం హీరోని, ఆంధ్రా బ్రూస్లిని చేసింది ఈ సినిమా. పరుచూరి బ్రదర్స్ కధతో, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది.

    తాజాగా ఈచిత్రం రీమేక్ ఖరారైంది. ప్రముఖ నిర్మాత తాండ్ర రమేష్ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. 2013లో ఆయన ఈ చిత్రాన్ని ప్రారంభంచే అవకాశం ఉంది. ఖైదీ చిత్రం రీమేక్ లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

    మూడు వందల చిత్రాలకు పైగా కథ, మాటల రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ కి ఓ కోరిక ఉందట. అదేమిటంటే... చిరంజీవి కెరీర్ లోనూ, తమ కెరీర్ లోనూ మరచిపోలేని చిత్రంగా నిలిచిన 'ఖైదీ' సినిమాని రామ్ చరణ్ తో రీమేక్ చేయాలనేది. స్ర్కిప్ట్ వర్క్ కూడా ప్రారంభించారు. ఇటీవల చిరంజీవికి కూడా ఈ విషయం చెప్పారు. ఆయన ఓకే అంటే వెంటనే పూర్తి స్ర్కిప్ట్ ను సిద్దం చేస్తామంటున్నారు.

    అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పట్లో నాన్న రీమేక్ సినిమాలు చేసే ఆలోచన లేదని ఆ మధ్య ఓ సందర్భంలో వెల్లడించారు. మరి ఈ నేపథ్యంలో 'ఖైదీ' రీమేక్ లో ఎవరు నటిస్తారు అనే దానిపై సందిగ్దత నెలకొంది. అయితే మెగా కుటుంబం సన్నిహితులు మాత్రం.... రామ్ చరణ్ చేస్తున్న బాలీవుడ్ రీమేక్ మూవీ 'జంజీర్' హిట్టయితే తెలుగులో ఆయన 'ఖైదీ' లాంటి రీమేక్ సినిమాలు చేసే అవకాశం లేక పోలేదంటున్నారు.

    English summary
    'Khaidi' movie which was a turning point in Chiranjeevi's career and gave him a fan following and is now being remade. 'Khaidi' was released on 28 October 1983 directed by Kodandarami Reddy and written by Paruchuri Brothers. Noted film producer Thandra Ramesh has acquired the rights of 'Khaidi' movie and he is planning to start the film in 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X